
మండల పరిపాలన అధికారి ఎం.పి డి.ఓ కార్యాలయం ఎ.ఓ, రాజశేఖర్ రెడ్డి పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న నందికొట్కూరు ఎమ్మెల్యే
నందికొట్కూర్ (పల్లెవెలుగు) 31 ఆగష్టు: నందికొట్కూరు మండల అభివృద్ధి అధికారి కార్యాలయము నందు పరిపాలన అధికారిగా సేవలు చేసి పదవీ విరమణ పొందుతున్న రాజశేఖర్ రెడ్డి పదవీ విరమణ కార్యక్రమానికి శాసనసభ్యులు తొగురు.ఆర్థర్ హాజరైయ్యారు. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ మాట్లాడుతూ పదవీ విరమణ చేస్తున్న రాజశేఖర్ రెడ్డి కి దేవుడు మంచి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించి వారి శేష జీవితం సంతోషంగా గడపాలని మనసారా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి మండల ప్రత్యేక అధికారి వరప్రసాద్, నందికొట్కూరు మున్సిపల్ కమిషనర్ జి. అంకి రెడ్డి, ఎంపీడీవోలు నాగ శేషాచల రెడ్డి, గౌరీ దేవి, సుబ్రమణ్య శర్మ, మండల విద్యాధికారి ఫైజున్నేసా, ఎన్ఆర్ఈజీఎస్ అదనపు ప్రాజెక్టు అధికారి వెంగన్న, నందికొట్కూరు టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజ రావు, పంచాయతీ రాజ్ ఏఈ. విజయ భాస్కర్, వెంకట్, నందికొట్కూరు నియోజకవర్గ మహిళా సమన్వయకర్త గంగిరెడ్డి.రమాదేవి, నందికొట్కూరు మండల వైసిపి నాయకులు ఉండవల్లి.ధర్మారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చందమాల.బాలస్వామి, మైనార్టీ నాయకులు శుఖుర్ మియ్య, అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస రెడ్డి, మురళి, ఇతర ప్రభుత్వ అధికారులు, రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు స్నేహితులు, వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.