
nandikotkur
ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే తొగురు ఆర్థర్
నందికొట్కూరు (పల్లెవెలుగు) 31 ఆగష్టు: స్థానిక ప్రభుత్వ వైద్యశాల యొక్క అభివృద్ధి కమిటీ సమావేశమునకు ఎమ్మెల్యే తొగురు.ఆర్థర్ హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కమిటీ సభ్యులు, పాత్రికేయులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ప్రభుత్వ వైద్యశాలను, పరిసరాలను ఆకస్మికంగా సందర్శించి వైద్యశాల యందు వైద్య సదుపాయం గురించి, ఏర్పాట్లు మరియు రోగుల అవసరాలు తదితర విషయాల గురించి డాక్టర్ రాయుడు చే చర్చించారు.