
అన్నదాతలకు అండగా ఉంటా ఎమ్మెల్యే తొగురు ఆర్థర్
నందికొట్కూరు (పల్లెవెలుగు) 30 ఆగష్టు: అన్నదాతలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని నందికొట్కూరు నియోజకవర్గ శాసనసభ్యులు తొగురు ఆర్థర్ అన్నారు. పాములపాడు మండలం వేంపెంట గ్రామానికి చెందిన ముణిమంద రామసుబ్బారెడ్డి అనే రైతు 15.09.2020న అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం భానకచర్ల గ్రామంలో ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ రైతు ఆత్మహత్య చేసుకున్న బాధిత కుటుంబానికి మంజూరైన రూ.7లక్షల రూపాయల చెక్కును మృతుని భార్య ముణిమంద సరస్వతమ్మకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తొగురు.ఆర్థర్ మాట్లాడుతూ అన్నదాతల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. రైతాంగం ఆత్మహత్యలకు పాల్పడవద్దని, మనో ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ముడియాల .శ్రీనివాసరెడ్డి, చౌడయ్య, నెమలి రమణారెడ్డి, ఎల్వీ రమణారెడ్డి, గంటా రమేష్, దానమయ్య, బోయ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.