nandikotkur

పచ్చి మిర్చి, ఉల్లికి ప్రభుత్వం గిట్టుబాటు ధర ప్రకటించాలి..సిపిఐ

నందికొట్కూరు (పల్లెవెలుగు) 25 ఆగష్టు: రాష్ట్ర ప్రభుత్వం రైతు పండించిన పంటలకు మద్దతు ధరతో పాటు పచ్చిమిర్చి, ఉల్లి కి తక్షణమే గిట్టుబాటు ధర ప్రకటించి రైతులను ఆదుకోవాలని సిపిఐ జిల్లా నాయకులు రఘురాం మూర్తి, తాలూకా కార్యదర్శి ఎం.రమేష్ బాబు లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం నందికొట్కూరు మండల పరిధిలోని పంటపొలాలను వారు పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం వారు మాట్లాడుతూ  ఉల్లి, పచ్చిమిర్చి లకు గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారని, ఇప్పటికే అధిక రేట్లతో  రసాయన ఎరువులు పిచికారి మందులు ధరలు విపరీతంగా పెరిగిపోవడం సేద్యం ఖర్చు వేలకు వేలు పెరిగిపోవడంతో పెట్టుబడులు పెట్టలేక రైతులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, అరుగాలం కష్టపడి పండించిన పంటలకు ఇప్పుడు గిట్టుబాటు ధర లేక పోవడం వల్ల దిక్కుతోచని పరిస్థితుల్లో రైతులు దిగలుగా ఉన్నారన్నారు.రైతులు గిట్టుబాటు ధరల కొరకు ఎదురుచూస్తున్నారని తక్షణమే అన్ని రకాల పంటలతో పాటు ఉల్లి పచ్చిమిర్చి కి గిట్టుబాటు ధరలు కల్పించే రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా వర్షాలు కురవక రైతులు సాగు చేసిన పంటలు ఎండుముఖం పట్టాయి అని తక్షణమే నష్టపరిహారం కింద రైతులను ఆదుకోవాలని ఎకరాకు 20 వేల రూపాయలు నష్టపరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే రోజుల్లో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు మోహన్, రాజు, బాష,నాగరాజు లు పాల్గొన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks