
అగ్రిగోల్డ్ బాధితులకు బాసటగా, జగనన్న ప్రభుత్వం: నందికొట్కూర్ ఎమ్మెల్యే తొగురు ఆర్థర్
నందికొట్కూర్ (పల్లెవెలుగు) 23 ఆగష్టు: స్థానిక శాసనసభ్యులు తొగురు ఆర్థర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసిన వైయస్ జగన్మోహన్ రెడ్డి” అనే అంశం మీద అగ్రిగోల్డ్ బాధితులతో ప్రత్యక్ష సమావేశం నిర్వహించిన నందికొట్కూర్ ఎమ్యెల్యే తొగురు ఆర్థర్ రాష్ట్రంలో అగ్రిగోల్డ్ కట్టి 10 వేల రు.ల లోపు డబ్బు కట్టి మోసపోయిన బాధితులకు జగనన్న ప్రభుత్వం పరిహారం పంపిణీ చేసిన విషయం తెల్సిందే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రేపు 20 వేల లోపు కట్టిన అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. జగనన్న ప్రభుత్వం ఏ ఒక్కరికి అన్యాయం జరగనివ్వకుండా బాధితులకు బాసటగా నిలుస్తుందనే దానికి ఇదే ఒక ఉదాహరణ అని అన్నారు. మాట ఇస్తే తప్పకుండా చేసే మనస్తత్వం మన రాష్ట్ర ప్రభుత్వం, జగనన్నది అని ఇప్పుడు మరోసారి రుజువు చేసుకున్నారు అని అన్నారు ఈ కార్యక్రమంలో నందికొట్కూర్ మండల అభివృద్ధి అధికారి శర్మ , 18వ వార్డు కౌన్సిలర్ ఉండవల్లి ధర్మారెడ్డి , మైనార్టీ నాయకులు శుకుర్ మియా, నందికొట్కూరు నియోజకవర్గం అగ్రిగోల్డ్ బాధితులు, పలువురు అగ్రిగోల్డ్ మహిళా బాధితురాల్లు పాల్గొన్నారు.