MahanandiAbdul Javid

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి.

మహానంది (పల్లెవెలుగు) 24 మర్చి: మహానంది-నంద్యాల  రహదారిలో తమడ పల్లె సమీపంలోని సూర్యనంది ఆర్చి  వద్ద రోడ్డు ప్రమాదంలో ఇటిక్యాల మహేంద్ర (25)బుధవారం సాయంత్రం మృతి చెందారు. నంద్యాల నుండి స్వగ్రామమైన పుట్టు పల్లె కుమోటార్ సైకిల్ పై వెళ్తుండగా అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న మట్టి దిబ్బలు ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదానికి కారణం మహాశివరాత్రి సందర్భంగా మహానంది బుక్కాపురం రోడ్డును ఆధునీకరించారు. రోడ్డుకు ఇరువైపులా మట్టి దిబ్బలుకొన్ని రోజుల క్రితం  వదిలిన వాటినిచదును  చేయకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణం బలి అవ్వడం చర్చనీయాంశంగా మారింది. మృతదేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు మహానంది పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు .రోడ్డుకు ఇరువైపులానిర్లక్ష్యంగా  వదిలిన మట్టి దిబ్బలను వెంటనే చదువు చేయాలి పలువురు కోరుతున్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks