Mahanandinaga ashok

డంపు యార్డ్ ను తలపిస్తున్న ప్రధాన రహదారి

ఆ దారి వెంటా పోయే జనం ముక్కు మూయాల్సిందే
సచివాలయ సిబ్బందికి ఆ డంప్ యార్డ్ కనిపించడం లేదంటా

మహానంది (పల్లెవెలుగు) 24 అక్టోబర్:  గాజులపల్లి మెట్ట నుండి మహాదేవపురం గ్రామానికి వెళ్ళె ప్రధాన దారిలో డంప్ యార్డును తలపించే విధంగా అక్కడ చెత్తాచెదారం వేసి రోడ్డే కనపడకుండా చేశారని నేషనల్ స్టూడెంట్ ఫెడరేషన్ (NSF) జిల్లా అధ్యక్షుడు చిన్న మండిపడ్డాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఆదారి వెంటా నిత్యం వేలమంది తిరుగుతుంటారు అయితే ఎక్కడ చూసినా చెత్త దిబ్బలు దిబ్బలు గా పేరుకుపోయి తీవ్ర కాలుష్యానికి అనారోగ్యానికి కారణమవుతోంది అని తెలుపుతూ అక్కడ ఉన్న చెత్త వలన చుట్టుపక్కల నివాసం ఉంటున్న ప్రజలు దుర్వాసన భరించలేక దోమలతో అనేక అంతుచిక్కని రోగాల వ్యాధులతో బాధపడుతున్నారని అదే విధంగా అక్కడ ఉన్న చెత్త వల్ల చాలాసార్లు ప్రమాదాలు జరిగి తలలు పగిలి, కాళ్ళు విరిగిన సందర్భాలు అక్కడ చోటుచేసుకున్నాయని ఆయన తెలుపుతూ, గ్రామీణ ప్రాంతాలన్నీ చెత్త మయం అవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న స్వచ్ఛభారత్ ర్యాకింగ్స్ లో గాజులపల్లె సచివాలయ సిబ్బంది పూర్తిగా విఫలమయ్యారని ఆయన తెలుపుతూ, చెత్తను నేరుగా ఇంటి నుంచి సేకరించాలని ప్రభుత్వం ప్రతిపాదనలు చేస్తే అధికారులు మాత్రం ప్రజల్లో అవగాహన కల్పించడంలో పూర్తిగా విఫలం చెందారని ఆయన తెలిపారు గాజులపల్లి గ్రామంలో చెత్తను సేకరించే కార్మికులకు చెత్తను సేకరించే సమయంలో ప్రతి రోజు ఫోటోలు తీస్తా రేగాని ఆ చెత్తను వర్మీ కంఫోస్ట్ షెడ్ లోకి సచివాలయ సిబ్బంది ఎందుకు పంపించరని ఆయన డిమాండ్ చేశారు ప్రభుత్వాలు మాత్రం గ్రామీణ స్థాయి నుండి చెత్తను సేకరించి సేంద్రియ ఎరువులుగా తయారు చేయాలని వర్మీ కంఫోస్ట్ షెడ్డులను లక్షలు పెట్టి నిర్మీస్తే ఆ షెడ్ లు నిరుపయోగ కరంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఇప్పటికైనా గాజులపల్లె అధికార పార్టీ నాయకులు సచివాలయ సిబ్బంది చొరవ తీసుకొని అక్కడ ఉన్నటువంటి చెత్తను తీసివేయాలని ఆయన డిమాండ్ చేశారు లేనిపక్షంలో ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శేఖర్, మధన్ ఖాన్, హరి, సుధాకర్, విక్రమ్, మల్లి, తదితరులు పాల్గోన్నారు.

Back to top button