Mahanandiprasad

సచివాలయ ఉద్యోగులు అందరూ మరింత బాధ్యతగా పనిచేయాల – యశస్విని

తిమ్మాపురం (పల్లెవెలుగు) 05 అక్టోబర్: జిల్లా జాయింట్ కలెక్టర్ (వెల్ఫేర్ & ఆసరా) కర్నూలు వారు నిన్నటి రోజు నిర్వహించిన టెలి కాంఫిరేన్స్  లోని ఆదేశాల మేరకు, మంగళవారం ఉదయం 11.30 గంటలకు మహానంది మండల కేంద్రమైన యం.తిమ్మాపురం ఎంపీడీఓ కార్యాలయం నందు జగనన్న తోడు, జగనన్న చేదోడు, YSR EBC నేస్తం లపై వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ లతో మండల అధ్యక్షులు కుమారి, బి.యశస్విని అధ్యక్షతన సమీక్ష చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుబ్బ రాజు, తహసీల్దార్ జనార్దన్ శెట్టి,  విస్తరణ అధికారి (PR & RD) శివ నాగ జ్యోతి, జూనియర్ అసిస్టెంట్ హేమ శంకర్ లు పాల్గొన్నారు. ఇందులో DRDA YKP CC లు కిషోర్ రెడ్డి, శ్రీనివాస బాబు, శేఖర్, వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ రవికుమార్, లింగమయ్య, మల్లికార్జున, లింగా నాగరాజు, రఫీ, షేక్ షావాలి, అపర్ణ, ఆశీర్వాదమ్మ, చంద్రకాంత్, వినాయక్, శంకర్ నాయక్ హాజరు కావడం జరిగినది. ముందుగా సచివాలయ సిబ్బంది అందరూ నూతన మండల అధ్యక్షుల వారితో పరిచయం చేసుకోవడం జరిగినది. ఈ సందర్బంగా మండల అధ్యక్షులు యశస్విని మాట్లాడుతూ ప్రభత్వం ప్రవేశపెట్టె ప్రతి సంక్షేమ పథకం అర్హులైన వారందరికీ  అందాలని,  ఇందులో భాగంగా సచివాలయ ఉద్యోగులు అందరూ మరింత బాధ్యతగా పనిచేయాలని చెప్పడం జరిగినది.

Back to top button