Mahanandinaga ashok

మహానంది మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ

  • నంద్యాల సబ్ కలెక్టర్ కుమారి చాహత్ బాజ్ పాయ్ .
  • మహానంది మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన నంద్యాల సబ్ కలెక్టర్ కుమారి చాహత్ బాజ్ పాయ్.

మహానంది (పల్లెవెలుగు) సెప్టెంబర్ 29 : బుధవారం మహానంది  మండల తహసిల్దార్ వారి కార్యాలయం ను నంద్యాల సబ్ కలెక్టర్ కుమారి చాహత్ బాజ్ పాయ్ ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది . అనంతరం నంద్యాల సబ్ కలెక్టర్ కుమారి చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ మహానంది మండల తహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేయడం జరిగిందని కార్యాలయంలోని  రికార్డులను  పరిశీలించడం జరిగిందిఅని తృప్తికరంగా ఉన్నాయన్నారు.  మండలంలో  జరుగుచున్న భూముల స్వచ్చీకరణ భూముల రీ సర్వే . కోవిడ్ నివారణ వ్యాక్సిన్. యం.డి. యు వాహనాల ద్వారా రేషన్ పంపిణీ .మరియు  స్పందన కు వచ్చినటువంటి వినతులను సత్వరమే పరిష్కరిస్తున్నారా ఇంకా ఏమైనా పెండింగ్ ఉన్నాయా  తదితర కార్యక్రమాలు ఎలా జరుగుతున్నా యని తహసీల్దార్ జనార్ధన శెట్టి ని అడిగి తెలుసుకున్నారు అనంతరం కార్యాలయ సిబ్బందికి తగు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగిందని ఆమె అన్నారు  . ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్  జనార్ధన శెట్టి డిప్యూటీ తాసిల్దార్ నారాయణరెడ్డి మండల రెవెన్యూ కార్యాలయం సిబ్బంది వీఆర్వోలు  సర్వేయర్లు పంచాయతీ సెక్రెటరీ లు తదితరులు పాల్గొన్నారు

Back to top button