
Koilakuntla
వృద్ధులకు, వితంతువులకు, అనాథలకు పింఛన్ల పంపిణి
కోయిలకుంట్ల (పల్లెవెలుగు) 6 సెప్టెంబర్: మండలం కోయిలకుంట్ల గ్రామంలో శ్రీచౌడేశ్వరిదేవి ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో అధ్యక్షులైన వై.వాణీదేవి వృద్ధులకు, వితంతువులకు, అనాథలకు ప్రతి నెలా మాదిరిగానే ఈ నెల ఆరో తేదీ ఒక్కొక్కరికి రెండు వందల చొప్పున యాభై మందికి పింఛన్లను పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో సోనీ ట్రస్టు విక్కీ, ట్రస్టు సహాయకుడు శ్యాంబాబు, మహిళా మండలి వారు, బావమ టీచర్ మరియు పత్రికా విలేకర్లు పాల్గొన్నారు