
మూల పెద్దమ్మ జాతర లో ఉచిత వైద్య శిబిరం
మూల పెద్దమ్మ జాతర లో ఉచిత వైద్య శిబిరం
గడివేముల (పల్లెవెలుగు) 04 ఏప్రిల్: శ్రీ మూల పెద్దమ్మ జాతర సందర్భంగా వచ్చిన భక్తులకు శ్రీ రాఘవేంద్ర హాస్పిటల్స్ నంద్యాల వారి ఆధ్వర్యంలో గ్రామంలోని శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం వద్ద డాక్టర్ సి.యాన్. రాఘవేంద్ర రెడ్డి, డాక్టర్ ఫ్రాంక్ మోహన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అమ్మవారిని దర్శించు కోవడానికి వచ్చిన దాదాపు 300 మంది భక్తులకు ఉచిత షుగర్ బిపీ పరీక్షలు నిర్వహించి భక్తులకు మాత్రలు పంపిణీ చేశారు. ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సందర్శించి అభినందించారు. రానున్న రోజుల్లో మరిన్ని ఉచిత సేవా కార్యక్రమాలు నిర్వహించి మన్ననలు పొందాలన్నారు. ఉచిత వైద్య శిబిరంలో ఇరిగెల ప్రభు కుమార్ రెడ్డి, నర్సింగ్ స్టాప్ తులసి, మౌలాబి, కోలా సురేష్, చంద్రశేఖర్, అశోక్, ఫార్మసిస్ట్ ఝాన్సీ, వసంత పాల్గొన్నారు


