gadivemulamahesh babu

ముగిసిన వార్డు మెంబర్లు, ఉపసర్పంచ్ ల శిక్షణ

గడివేముల (పల్లెవెలుగు)30 సెప్టెంబర్: గడివేములలోని మండల పరిషత్ కార్యాలయం లో వార్డు మెంబర్లు, ఉప సర్పంచులకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఈ ఓ ఆర్డీ ఆధ్వర్యంలో గురువారం నాడు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఈవో ఆర్డి మాట్లాడుతూ… గ్రామ సమస్యలపై వార్డు మెంబర్లు ఉప సర్పంచులు అవగాహన కలిగి ఉండి సర్పంచుల సమన్వయంతో గ్రామాల అభివృద్ధికి కలిసి పని చేయాలన్నారు.ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. వార్డు మెంబర్లు ఉప సర్పంచులు గ్రామ అభివృద్ధికి తోడ్పడి  గ్రామంలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించి ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకునేలా చూడాలన్నారు. అనంతరం ట్రైనర్లు వార్డు మెంబర్లకు ఉప సర్పంచులకు వారి హక్కులు,విధులు, జాబ్ చార్ట్ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అన్ని పంచాయతీ కార్యదర్శులు,గ్రామాల వార్డు సభ్యులు,ఉప సర్పంచులు పాల్గొన్నారు.

Back to top button