DhoneMahabasha - dhone

డాక్టర్ సుంకన్న గారి బదిలీ నిలిపివేయాలి:-DYFI డిమాండ్

డాక్టర్ సుంకన్న గారి బదిలీ నిలిపివేయాలి:-DYFI డిమాండ్

డోన్ (పల్లె వెలుగు) 11 ఫెబ్రవరి:  పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో గైకనాలిస్టు గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సుంకన్న బదిలీ నిలిపివేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(DYFI) ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ వైద్యశాల ముందు ఆందోళన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి DYFI మండల గౌరవాధ్యక్షలు నక్కి శ్రీకాంత్, భారత ప్రజాతంత్ర మహిళ సమాఖ్య(ఐద్వా)జిల్లా ఉపాధ్యక్షరాలు షేమిమ్ బేగం, DYFI మండల అధ్యక్షులు అబీబ్ బాషా లు మాట్లాడుతూ పట్టణంలోని  ప్రైవేట్ నర్సింగ్ హాస్పిటల్స్ పేద ప్రజలను గర్భిణీ స్త్రీలను సిజరియన్ ల పేరుతో వేల రూపాయలు జలగల పీడిస్తున్న తరుణంలో అనేక సంవత్సరాల ఉద్యమాల ఫలితంగా పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు సిజేరియన్ సౌకర్యం రావడం జరిగిందని వారు తెలిపారు, ప్రభుత్వ వైద్యశాలకు సిజేరియన్ సౌకర్యం కొరకు వచ్చిన ఆనాటి కాలంలోని కొంతమంది గైకనాలిస్టు వైద్యులు సక్రమంగా విధులకు హాజరు కాకుండా గర్భిణీ స్త్రీలను బాలింతలను  ప్రైవేట్ హాస్పిటల్ నడిపించిన కాలాలు చాలా  ఇక్కడ జరిగాయని వారు గుర్తు చేశారు, డాక్టర్ సుంకన్న గారు డోన్ ప్రభుత్వ వైద్యశాలకు డాక్టర్ గా వచ్చినప్పటినుండి నిత్యం రాత్రనక పగలనక ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ కష్టం వచ్చినా గర్భిణీ స్త్రీలకు బాలింతలకు అందుబాటులో ఉంటూ మంచి సేవ అందించారాని వారు ప్రశంసించారు. ఈ రోజు జిల్లా స్థాయిలో ప్రభుత్వ వైద్యశాలకు మంచి పేరు రావడానికి డాక్టర్ సుంకన్న వైద్య సేవలే కారణమని వారన్నారు పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు నిత్యం  ఈ నియోజకవర్గ ప్రాంతం నుంచే కాకుండా పత్తికొండ, తుగ్గలి, ఆలూరు, ఆస్పరి, మద్దికేర, క్రిష్ణగిరి, వెల్దుర్తి, చిప్పగిరి మండలాల నుంచి కూడా అనేకమంది పేద గర్భిణీ స్త్రీలు బాలింతలు నిత్యం వస్తు వైద్య సేవలు అందించు కుంటున్నారని, అనేకమంది పేద ప్రజలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహిస్తూ మంచి గుర్తింపు పొందిన ఈ నియోజకవర్గానికి మంచి పేరు తీసుకొచ్చింది డాక్టర్ సుంకన్న గారి బదిలీ నిలుపుదల చేసే విధంగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చొరవ తీసుకోవాలని వారు విజ్ఞప్తిచేశారు. ఇలాంటి వైద్యులు లేకపోతే ఈ ప్రాంతంలోని పేద గర్భిణీ స్త్రీలను ను బాలింతలను పట్టి పీడించడం కోసం ప్రైవేట్ కార్పొరేట్ వైద్యశాలలు తయారవుతాయని వారన్నారు, నిత్యం కరువుతో అల్లాడుతున్న వంటి పడమటి ప్రాంత రైతాంగ కుటుంబాలకు ప్రభుత్వ వైద్యం అందాలంటే ఇలాంటి వైద్యులు ఈ ప్రాంతానికి చాలా అవసరమని వారన్నారు, డాక్టర్ సుంకన్న బదిలీ అవుతున్నారన్న విషయం తెలిసిన అనేకమంది పేద మహిళలు స్వచ్ఛందంగా  ముందుకు వచ్చి బదిలీని ఆపాలని కోరడం చూస్తుంటే వారు పేదలకు  ఏవిధమైనటువంటి సేవలందించారో ఒకసారి ఉన్నత వైద్య అధికారులు, ఈ ప్రాంత ఎమ్మెల్యే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గుర్తించాలని వారు కోరారు ఇప్పటికైనా డాక్టర్ సుంకన్న బదిలీని నిలుపుదల చేయాలని లేనియెడల మరిన్ని ప్రజా సంఘాలను కలుపుకొని ఉద్యమిస్తామని వారన్నారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు శ్రీను, షేక్షావలి, సిద్దు, ఉస్సేన్ బాషా, మహబూబ్ బాషా, ఐద్వా నాయకురాలు దేవి,మహాలక్ష్మి, సునీత, రామేశ్వరి, లక్ష్మీదేవి, లావణ్య, పుష్పలత, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

Back to top button