DhoneMahabasha - dhone

ఫ్యాప్టో ఆధ్వర్యంలో డిసెంబర్ 3న జరిగే నిరసన దీక్షను విజయవంతం చేయండి – షణ్ముర్తి

ఫ్యాప్టో ఆధ్వర్యంలో డిసెంబర్ 3న జరిగే నిరసన దీక్షను విజయవంతం చేయండి – షణ్ముర్తి

 డోన్ (పల్లె వెలుగు) ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై ప్రభుత్వ నిర్లిప్త వైఖరికి నిరసనగా ఫ్యాప్టో ఆధ్వర్యంలో డిసెంబర్ 3న విజయవాడలో జరిగే ఎమ్మెల్సీలు, ఫ్యాప్టో రాష్ట్ర కార్యవర్గ సభ్యుల నిరసన దీక్షకు ఎస్టీయూ డోన్ తాలూకా శాఖ తరపున సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ఎస్టీయూ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు ఈ. షణ్ముర్తి తెలిపారు. రాష్ట్ర నాయకులు జి.వి. రమణ మాట్లాడుతూ జులై 2018 నుంచి అమలు కావాల్సిన 11వ పీఆర్సీ ఇప్పటికే మూడున్నర సంవత్సరాలు (41నెలలు ) ఆలస్యం అయ్యిందన్నారు.

ఎస్టీయూ రాష్ట్ర మైనార్టీ కో – కన్వీనర్ మౌలాలి మాట్లాడుతూ వారం రోజుల్లో రద్దు చేస్తామన్న సీపిఎస్ రెండున్నర సంవత్సరాలు పూర్తయినా అమలు కాలేదన్నారు. సకాలంలో డి.ఎ. చెల్లిస్తామని మాట ఇచ్చిన ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 5 విడతల డి.ఎ.లు, రెండు విడతల డి.ఎ. బకాయిల చెల్లింపులు పెండింగ్ లో ఉందన్నారు. విద్యారంగంలో ఉపాధ్యాయులను బోధన తప్ప మిగిలిన అన్ని పనులు చేయిస్తున్నారని ఎస్టీయూ డోన్ మండల అధ్యక్షులు షేక్ హుస్సేన్ అన్నారు.

ఈ సమస్యలపై ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులను శాసనమండలిలో ఎమ్మెల్సీలు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రభుత్వంలో చలనం లేదన్నారు. కనుక ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఎమ్మెల్సీలు ఫ్యాప్టో ఆధ్వర్యంలో జరుగుతున్న డిసెంబర్ 3 న జరిగే నిరసన దీక్షను విజయవంతం చేయాలని షణ్ముర్తి గారు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు సి. శ్రీనివాసులు, మండల ప్రధాన కార్యదర్శి భాస్కర్, మండల ఆర్థిక కార్యదర్శి రాం మోహన్, ఉపాధ్యాయ వాణి కన్వీనర్ శ్రీనివాసులు, మీడియా కన్వీనర్ విశ్వనాథ్, సీనియర్ నాయకులు శివ ప్రసాద్, సురేష్ బాబు, టి. శ్రీనివాసులు, నందప్ప, రాం ప్రసాద్, లక్ష్మి రెడ్డి, రామదాసు, కృష్ణగిరి, ప్యాపిలి, వెల్దుర్తి మండల నాయకులు జగన్మోహన్ రెడ్డి, చిన్నపరెడ్డి, చంద్రమౌళి, ఓబులేసు,రమేష్, ప్రేమ్ కుమార్, గోపాల్, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Back to top button