DhoneMahabasha - dhone

ఘనంగా కోట్ల విజయ భాస్కర రెడ్డి వర్దంతి

డోన్ (పల్లె వెలుగు) 27 సెప్టెంబర్: కోట్లవిజయభాస్కర్ రెడ్డి  వర్దంతిని డోన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యములో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా నంద్యాల డిసిసి ప్రధాన కార్యదర్శి డాక్టర్ గార్లపాటి మద్దులేటి స్వామి, డిసిసి కార్యదర్శి ఉన్నిగొర్ల జనార్దన్ లు స్థానికంగా గెస్ట్ హౌస్ కు ఎదురుగా ఉన్న పెద్దాయన విగ్రహానికి పులామాల వేసి నివాళులు అర్పించారు. అదే విదంగా స్థానిక కోట్ల విజయభాస్కర్ రెడ్డి నగర్ లో పెద్దాయన ఫ్లెక్సీ కి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పెద్దాయన, దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర రెడ్డి పదవులకే వన్నె తెచ్చి, నీతికి, నిజాయితీకి మారుపేరుగా నిలచి మచ్చలేని మనిషిగా పేరొంది. జీవితాంతం రైతాంగ సంక్షేమం కొరకు పరితపించి పల్లెపల్లెకు సాగునీరు, త్రాగు నీరు అందించి సీమ అపర భగీరథుడు గా పేరు గాంచి తెలుగు వారి పెద్దాయనగా ప్రజల మనసుల్లో నిలిచారని, ఆంధ్రరాష్ట్ర ప్రజలకు పెద్దాయన గా సుపరిచితులు. దేశ రాజకీయాలలో తనదైన శైలి లో ముద్ర వేసుకున్న నేతగా నిలిచి, పేదవారి ఎదుగుదలే సమాజ నిర్మాణానికి నాంది అని భావించి వారి ఎదుగుదలకు నిరంతరం కృషి చేసిన మహా మనిషి అని కొనియాడారు, ఎన్నో కుటుంబాలకు అండగా నిలిచి ఉపాధి , ఉద్యోగ అవకాశాలు కల్పించి, ఆ కుటుంబాలకు పెద్దకొడుకు లా నిలిచారు. రెండు సార్లు ముఖ్యమంత్రిగా 6 సార్లు పార్లమెంట్ సభ్యునిగా, కేంద్రమంత్రి గా అనేక పదవులు అలంకరించి ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో సేవచేసారని, వారి పాలనా వ్యవస్థ గురించి ఎంత చెప్పినా తక్కువే ,ఆ పెద్దాయన గురించి ఈ నాటికీ పల్లెపల్లెలో కోట్ల అనే పేరు వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమములో  కోట్ల అభిమానులు భాస్కర్ నాయుడు, బాబులాల్, శ్రీరాములు, లారీ బాషా, రవి,  సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాయల్ మల్లి, డోన్ పట్టణ అధ్యక్షులు ఆర్ గోపీనాథ్ రావు, మండల అధ్యక్షులు వడ్డె రాజశేఖర్, యూత్ కాంగ్రెస్ మండల అద్యక్షులు కె.మనోజ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ శైలేంద్ర, లక్ష్మన్న, నాయకులు, హనుమాన్, రామభూపాల్, రామకృష్ణ, వెంకటేశ్వర్లు, మేడబోయిని ప్రసాద్, మధు, మహేష్, శివరాం, మల్లి ఖార్జున, తదితరులు పాల్గొన్నారు.

Back to top button