
పరజల ప్రాణాలు తీసే కరెంట్ పోల్ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలి :పట్టణ కార్యదర్శి నక్కిశ్రీకాంత్ డిమాండ్
డోన్ (పల్లె వెలుగు) 24 ఆగష్టు: పట్టణంలోని వైస్సార్ నగర్ లో ప్రజల ప్రాణాలు ఆరించే విదంగా ఏర్పాటు చేస్తున్న కరెంట్ పోల్స్ ను తక్షణమే తొలగించాలని సీపీఐ పట్టణ కార్యదర్శి నక్కిశ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక కాలనీలో కరెంట్ పోల్స్ ను పరిశీలించి కాలనీలోని వాటి వల్ల జరిగే నష్టాన్ని కాలనీ ప్రజలతో మాట్లాడి తెలుసుకోవడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణంలోని వైస్సార్ నగర్ లో కొత్తగా ఏర్పాటు చేస్తున్నట్టు వంటి అధిక ఓల్డేగ్ విద్యుత్తు పోల్స్ వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని అన్నారు ఇక్కడ ఉన్న ఇండ్లకు అనుకోని ఏర్పాటు చేయడం వల్ల కాలనీలోని ప్రజలు రోజువారీగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయపడుతూ జీవించే పరిస్థితి తీసుకువచ్చే దుస్థితి విద్యుత్తు అధికారులు తీసుకరావలనుకోవడం చాలా దుర్మార్గపు చర్య అని వారు ఆవేదన వ్యక్తంచేశారు,అధిక ఓల్డేజ్ తో సరఫరా అయే ఈ విద్యుత్తు ఇండ్లకు ఎలాంటి ఉపయోగంలేదు ఈ కరెంట్ పారిశ్రామికవేత్తలేన గ్రానైట్, చిప్స్, కంకర, బ్యాగ్స్ తయారీ యజమానులకు మాత్రమే ఉపయోగకరమని,వారి ఆదాయాన్ని కాపాడేందుకు కాలనీలోని పేదప్రజల ప్రాణాలను పణంగా పెట్టడం మంచిదా అని వారు ప్రశ్నించారు,గతంలో 300 మీటర్లు దూరంలో ఉన్నప్పుడే గాలులకు,వర్షానికి ఇండ్లలోకి నిప్పురవ్వలు పదేవని దానివల్ల అనేకమంది మహిళలకు, పిల్లలకు,వృద్దులకు గాయాలు అయిన సందర్భాలు అనేకంగా ఉన్నాయని కాలనీ వాసులు వారికి తెలిపారు.ఇప్పటికైనా విద్యుత్తు, మునిసిపల్ అధికారులు స్వందించి ప్రజల ప్రాణాలను హరించే విద్యుత్తు పోల్స్ పనులను నిలుపుదల చేసి ఏర్పాటు చేసిన పోల్స్ తొలగించాలని లేని యెడల కాలనీ వాసులతో ఆందోళన చేపడుతామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వైస్సార్ నగర్ శాఖ కార్యదర్శి వెంకటేష్, సహాయ కార్యదర్శి రామచంద్రుడు, కొండపేట శాఖ కార్యదర్శి లక్ష్మీ దేవి,వీరేశ్, విజయ్, కరంపొడి వెంకటేష్ లు పాల్గొన్నారు