
మహిళలకు కేటాయించిన బహిర్భూమి ఆక్రమణ
డోన్ (పల్లె వెలుగు) 16 ఆగష్టు : డోన్ మునిసిపల్ పరిధిలోని పాతపేట సామీపంలోని రాముల దేవాలయం దగ్గర మహిళాలకు కీటాయించిన బహిర్భూమిని కొందరు వ్యక్తులు అక్రిమించారని ప్రజల సమస్యల పరిస్కార వేదిక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టటాత్మంగా చేపడుతున్న స్పందన కార్యక్రమంలో తహసీల్దార్ సమక్షంలో పాతపేట మహిళలుభారత కార్మిక సంఘాల సామాఖ్య జిల్లా ఉపాధ్యక్షులు రంగనాయకులు ఆధ్వర్యంలో డిప్యూటీ కలెక్టర్ కి విన్నానించుకున్నారు. ఈ సందర్బంగా రంగనాయకులు మహిళాలు మాట్లాడుతూ డోన్ మునిసిపల్ పరిధిలోని పాతపేట రాముల దేవాలయం వద్ద పేద మహిళలమైన తమకోసం బహిర్భూమికి కేటాయించిన స్టలాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమించారని, ఈ విషయం మునిసిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లినా తమ సమస్య పరిస్కారం కాలేదని నలుగురికి చెప్పుకోలేని బహిర్భూమికి ఎక్కడికి పోవాలని, మహిళల బహిర్భూమి సమస్య పరిష్కరించనప్పుడు డోన్ మునిసిపాలిటీకి ఎన్ని అవార్డులు వచ్చినా మాకేంటని ప్రశ్నించారు. అదేవిదంగా పట్టణంలోని నెహ్రు నగర్, శ్రీనివాస్ నగర్ లలో డ్రైనేజి సమస్య పరిష్కరించాలని భారత కార్మిక సంఘాల సామాఖ్య జిల్లా ఉపాధ్యక్షులు రంగనాయకులు తెలియచేశారు.