Dhone

రమ్యను హత్య చేసిన దుండగుడిని ఎన్ కౌంటర్ చేయాలి – సిపిఐ డిమాండ్

డోన్ (పల్లె వెలుగు) 16 ఆగష్టు : డోన్ పట్టణంలో  స్థానిక పాత బస్టాండ్ నందు సోమవారం ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతున్న వారు సీపీఐ డోన్ నియోజకవర్గ కార్యదర్శి ఎన్.రంగనాయుడు,సీపీఐ నాయకులు సుంకయ్య , రాధాకృష్ణ  శ్రీకాంత్ అంగన్వాడీ జిల్లా కార్యదర్శి సుగుణమ్మ, ఏఐవైఫ్ డిస్ట్రిక్ట్  పులిశేఖర్ ఏ ఐ ఎస్ ఎఫ్ శివన్న లూ ఈ ధర్నా కార్యక్రమం ప్రధానంగా స్వాతంత్ర దినోత్సవం రోజున గుంటూరు నడిబొడ్డులో బీటెక్ చదువుతున్న రమ్య స్కూటీ మీద వెళ్తుండగా స్కూటీ నీ ఆపి లిఫ్ట్ ఇయ్యాలని స్కూటీ కి అడ్డం నిలబడి శశి కృష్ణ అనే దుండగుడు రమ్య పై కత్తి తీసుకొని రమ్య చేయి పట్టుకొని కత్తితో విచక్షణ రహితంగా రమ్యను పొడుస్తున్న చుట్టుపక్కల ఉన్న ప్రజలు చూస్తూ ఉన్నారు కానీ ఏమాత్రం దాడిని అడ్డుకోకుండా రమ్మను కాపాడలేకపోయారు అంటే సమాజం మనమందరం తలదించుకోవాల్సిన రోజు కనీసం మానవత్వంతో మన చెల్లెలు మన అక్క నో లేదా కూతురు అనుకొని ఆ దుండగుడి పై పక్కన చూస్తున్న వారంతా ఆ దాడిని అడ్డుకొని రమ్మను కాపాడి ఉంటే బాగుండేది స్వతంత్ర దినోత్సవం రోజున పట్టపగలే రమ్యను కాపాడలేకపోయారు అని ఆవేదన కలిగిస్తోందని మరియు భారతదేశ ప్రజలు స్వేచ్ఛగా సంతోషంగా జీవించాలని దేశ సరిహద్దుల్లో ప్రాణాలర్పిస్తూ ప్రాణాన్ని పణంగా పెట్టి దేశాన్ని జవాన్లు కాపాడుకుంటే మనం మాత్రం మన కళ్ళముందు దళిత విద్యార్థుల పైన విద్యార్థుల పైన ఉన్మాదులు హత్యలు చేస్తా ఉంటే మనం మాత్రం చూస్తూ ఊరు ఉండడమే తప్ప అమ్మాయిలను రక్షించ లేక పోతున్నాం అంటే మనము ఉన్న ఒకటే లేకున్నా ఒకటే అనిపిస్తుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.మహిళలకు ఎన్ని చట్టాలు వచ్చినా మరియు దిశ చట్టం వచ్చినా విద్యార్థినిలపై నా మహిళలపై నా హత్యాచారాలు హత్యలు జరుగుతూనే ఉన్నాయి ప్రభుత్వాలు మాత్రం ప్రెస్ మీట్లకు  ఉపయోగపడుతున్నాయి కానీ అమ్మాయిలకు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలం చెందుతున్నాయి.ఆంధ్రప్రదేశ్లో ట్రాఫిక్ పోలీసులు లేనందునే స్వాతంత్ర్య దినోత్సవం రోజున గుంటూరు నడిబొడ్డులో రమ్య పై దుండగు డు హత్య చేయడం జరిగిందని ట్రాఫిక్ పోలీసులు ఉండి ఉంటే రమ్య ప్రాణాలతో బయట పడేది అని అందువలన ట్రాఫిక్ పోలీసులను పెంచి ఇలాంటి  దాడులు చేసిన దుండగులను నడిరోడ్డు మీద  ఎన్కౌంటర్ చేయాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో  అబ్బాస్  పుల్లయ్య  ప్రభాకర్  చాందిని రామమోహన్  మనోహర్ రామ్మోహన్,సాయి,హరినాథ్, శివ శంకర్,ముస్తఫా, కమలాకర్  విద్యార్థులు పాల్గొన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks