
ఉద్యోగ భద్రత.ఆశా వర్కర్ల వేతనాలకై చలో ”విజయవాడ’ పిలిపునిచ్చిన ఏఐటియూసి
డోన్ (పల్లె వెలుగు) 13 ఆగష్టు: ఆశా వర్కర్ల కనీస వేతనం, ఉద్యోగ భద్రత పై చలో విజయవాడకు సిద్ధం కావాలని ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు, ఏఐటియూసి జిల్లా కార్యదర్శి,ఏఐటియుసి డోన్ నియోజకవర్గ అధ్యక్షా కార్యదర్శులు పుల్లయ్య, అబ్బాస్ పిలుపునిచ్చారు.డోన్ స్థానిక కార్మిక కార్యాలయంలో జరిగిన ఆశా కార్యకర్తల ముఖ్య సమావేశంలో నాయకులు సుంకయ్య సుగుణమ్మ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆశా వర్కర్లు మహిళ గర్భందాల్చిన నాటి నుండి ప్రసవం అయ్యేంత వరకు వారి రక్షణగా సేవలందిస్తూ ప్రతిరోజు ప్రజల ఆరోగ్యం కొరకు జరిగే మలేరియా సర్వే, కుష్టు రోగుల సర్వే, న్యూమోనియా,టీబి వ్యాధిగ్రస్తులకు మందులు ఇస్తూ ప్రజల ప్రజలకు నిత్యం సేవలందిస్తున్న ఆశా వర్కర్లకు కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు సేవలు చేయించుకున్నారు తప్ప వారి శ్రమకు తగ్గ వేతనం ఇవ్వడం లేదు గౌరవ వేతనం పేరుతో వారి శ్రమను దోచుకుంటున్నారని,అనేక సంవత్సరాలుగా ఏఐటియుసి జాతీయస్థాయిలో పోరాటాలు ఆందోళనలు చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలలో పని చేస్తున్న స్కీం వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మిక చట్టాలు అమలు చేయాలని వీరిని కార్మికులుగా గుర్తించి కనీస వేతనం PF, ESI ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగా గుర్తించాలని పోరాటం చేసిన ఫలితంగా ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ లో తీర్మానం చేయడం జరిగింది, దేశంలో ఎక్కడ స్కీమువర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేదు అందుకే తప్పని పరిస్థితిలో తమ సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాలు సమర్పించినా ఫలితం లేదనీన్ చివరిగా ఈనెల 17వ తేదీన చలో ‘విజయవాడ’కు పిలుపునిచ్చారు,ఈ సమావేశంలో ఏఐటియూసి కర్నూలు జిల్లా అధ్యక్షుడు పి సుంకయ్య,జిల్లా కార్యదర్శి సుగుణమ్మ,కార్యదర్సులు అబ్బాస్,పుల్లయ్య,ఆశా వర్కర్లు పాల్గొన్నారు….