bandi aatmakur

రిపబ్లిక్ డే సందర్భంగా బండి ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 16 మంది  పేద విద్యార్థిని విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ

రిపబ్లిక్ డే సందర్భంగా బండి ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 16 మంది  పేద విద్యార్థిని విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ

బండి ఆత్మకూరు (పల్లెవెలుగు) జనవరి 26 : గణతంత్ర స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని బండి ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు కాలేజీ ప్రిన్సిపల్  కె. గీతా వాణి వారి ఆధ్వర్యంలో ఉదార స్వభావం తో  మూర్తి రెడ్డి సరోజమ్మ, యుగంధర్ రెడ్డి చేతుల మీదుగా 80 వేల రూపాయలు పైకం హెచ్చించి 16 మంది పేద విద్యార్థిని విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ కే. గీతా వాణి మాట్లాడుతూ, రిపబ్లిక్ డే అంటే పూర్తి స్వాతంత్ర్యం వచ్చిన రోజు అంతేకాకుండా వివిధ కులాలు వివిధ మతాలు, వివిధ జాతులు, వివిధ భాషలు జీవన ప్రమాణాలు, జీవన శైలులు అందరికీ ఉన్నాయి.  కానీ  మన భారతదేశంలోనే ముఖ్యంగా రిపబ్లిక్ డే మన అందరికీ సమానమైన హక్కులు, సమానమైన స్వేచ్ఛను కల్పించిన రోజు కనుక రిపబ్లిక్ డే సందర్భంగా, పుణ్య దంపతులు శ్రీ మూర్తి రెడ్డి యుగంధర్ రెడ్డి సరోజమ్మ లు ఇప్పటివరకు మా కళాశాల కు లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చి ఉన్నారు. మహారాజ పోషకులు అంటే ఎవరో కాదు, శ్రీ మూర్తి రెడ్డి యుగంధర్ రెడ్డి సరోజమ్మ లు అని వీరు దేవాలయాలకు, ఎంతోమంది పేదలకు సహాయ సహకారాలు అందించడంలో వీరికి వీరే సాటి అని,  అంతేకాకుండా అడిగిన వెంటనే పేద విద్యార్థిని విద్యార్థులకు పల్లెటూర్ల నుండి రావాలి అంటే బస్సు సౌకర్యం లేని ఈ పరిస్థితుల్లో వాళ్లకు నేనున్నాను అంటూ 16 మంది పేద విద్యార్థిని విద్యార్థులకు 80 వేల రూపాయలు ధనం వెచ్చించి 16 మంది పేద విద్యార్థిని విద్యార్థులకు సైకిళ్ళు పంపిణీ చేయడం ఎంతో హర్షించదగ్గ విషయమని కొనియాడారు. అనంతరం ఈ సందర్భంగా మూర్తి రెడ్డి యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ సైకిల్స్ పంపిణీ చేయడానికి ముఖ్య కారణం విద్యార్థిని విద్యార్థులు కాలేజీకి సమయానికి రాలేక పోతున్నారని, అడిగిన వెంటనే నేను ఈ సైకిళ్లు పంపిణీ చేయడం జరిగింది. అయితే మీరు ఏదో ఒక సాకు చెప్పి కాలేజీకి రాకుండా ఉండడం చేయకండి  ఎందుకంటే మనం సక్రమంగా కాలేజీకి వచ్చి విద్య నభ్యసించు ని విద్యావంతులు కావాలి దేశానికి ఉపయోగపడాలి. మనకి సైకిల్ ఎవరో ఇచ్చారు ఎలా  వాడుకుంటే మాకేంటి అనే స్వభావము మానుకొని సైకిల్ నాది అనుకొని వాడుకొని, మరల తర్వాత విద్యార్థిని విద్యార్థులకు ఉపయోగపడేలా మీరు ఆ సైకిల్ లో కాలేజీకి అప్పచెప్పితే, మీ తర్వాత భావితరాల విద్యార్థిని విద్యార్థులకు ఉపయోగపడుతుందని, నేను భావిస్తున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో  కాలేజీ లెక్చరర్స్ రామ సుబ్బారెడ్డి ii శ్యామల కుమారి, శోభారాణి, ప్రసాద్, శివ కుమార్,  సురేష్, శివరామకృష్ణ ఆచారి,  స్టూడెంట్స్ విజయలక్ష్మి ,మైథిలి ప్రవీణ, కార్తీక్, రహంతుల్లా నాగార్జున, ముర్తుజావలి తదితర విద్యార్థిని విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Back to top button