
bandi aatmakur
పడకేసిన పారిశుధ్యం పట్టించుకోని అధికారులు
బండి ఆత్మకూరు (పల్లెవెలుగు) బండి ఆత్మకూరు మండలం కడమల కాలువ గ్రామంలో సైడ్ కాలువలు ఏర్పాటు చేయండి మహాప్రభో అని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడంలేదని, కాలనీవాసులు స్వయంగా బురదను తొలగిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం పడినప్పుడు ప్రతిసారి ఇదే పరిస్థితి ఉంటుందని, స్వాతంత్రం వచ్చి75 సంవత్సరాలు అయినప్పటికీ ప్రజల స్థితిగతులు మారడం లేదని మీడియా ద్వారా వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కడమల కాలువ గ్రామము ను సందర్శించి కాలనీలో డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి, పారిశుధ్యం పై చర్యలు తీసుకొని ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని గ్రామస్తులు కోరారు.