bandi aatmakur

నాడు నేడు తో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ

బండి ఆత్మకూరు (పల్లెవెలుగు) 16 ఆగష్టు: మండల పరిధి లోని  ఏ కోడూరు గ్రామం లో యంపిపి  పాఠశాలలో జరిగిన నాడు నేడు మొదటి విడత పనులు జగనన్న విద్యాకానుకపంపిణీ, రెండవ విడత పనుల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా శ్రీశైలం నియోజకవర్గం శాసన సభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ ను నిర్దేశించే విద్యాపండుగ వచ్చిందని , విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసం సీఎం జగన్  వేల  కోట్ల నిధులను వెచ్చించడానికి వెనుకడుగు వేయలేదన్నారు.నాడు నేడుతో కార్పోరేట్ స్థాయిని తలదన్నుతో ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందాయన్నారు.విద్యార్థులభవిష్యత్ కు బాటలు వేసే తరగతుల ప్రారంభమయ్యాయన్నారు. నాడు నేడు తో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ కల్గిందన్నారు.  జగనన్న విద్యాకానుక క్రింద నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా విద్యార్థిణీ విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్,యూనిఫామ్ లను ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అందించరు .ఈకార్యక్రమంలో శ్రీశైలం నియోజక వర్గ వైఎస్సార్సీపీ సమన్వయ కార్యకర్త శిల్పా భువనేశ్వర రెడ్డి , ఎంపీడీవో వాసు దేవా గుప్తా , ఎమ్మార్వో హరిత,  మండల కన్వీనర్ బారెడ్డి శ్రీనివాస రెడ్డి, జడ్పిటిసి దేరెడ్డి సంజీవ రెడ్డి,మాజీ ఎంపీపీ దేసు వెంకట రామిరెడ్డి, పుల్లారెడ్డి, సర్పంచ్ జ్ఞాన భరణం,సుబ్రమణ్యంరెడ్డి,నాగరాజు, వైఎస్సార్సీపీ నాయకులు అయా గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు కార్యకర్తలు స్కూల్ ఉపాద్యాయులు  తదితరులు పాల్గొన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks