banaganapalliMani News

పెద్దమ్మ తల్లి అమ్మవారి జాతర సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం

పెద్దమ్మ తల్లి అమ్మవారి జాతర సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం

బనగానపల్లె (పల్లెవెలుగు) 17 మార్చి: కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం టంగుటూరు గ్రామం లో ప్రతి సంవత్సరం జరుగుతున్న పెద్దమ్మ తల్లి అమ్మవారి జాతర కు దర్శించుకోవడానికి వస్తున్నటువంటి భక్తులకు టంగుటూరు గ్రామస్తుడైన ఏపిపిటిడి కానిస్టేబుల్ జాగటి గురప్ప గౌడ్ టంగుటూరు బస్టాండ్ ఆవరణంలో మంచి భోజనం తయారు చేయించి దర్శించుకోవడానికి వస్తున్నటువంటి భక్తులకు గత ఐదు సంవత్సరముల నుండి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ కొనసాగిస్తున్నారు. భక్తులందరూ ఈ వేసవికాలంలో మంచి భోజనం, చల్లటి నీళ్లు ఏర్పాటు చేసినందుకు  ఏపీ పీ టి డి కానిస్టేబుల్ జాగటి గురప్ప గౌడ్ కి ధన్యవాదములు తెలుపుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో జాగటి గురప్ప గౌడ్  కుటుంబ సభ్యులు పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు.

Back to top button