banaganapalli

ఘనంగా మదరసా నూరాని హాదియా మోడల్ స్కూల్ వార్షిక వేడుకలు

ఘనంగా మదరసా నూరాని హాదియా మోడల్ స్కూల్ వార్షిక వేడుకలు

బనగానపల్లె (పల్లెవెలుగు) 14 మర్చి: పట్టణంలో నీ లాల్ మసీదు లో నిర్వహిస్తున్న మదరసా నూరాని హాదియా మోడల్ స్కూల్ వార్షిక వేడుకలు మరియు మదరసా హా దియా వారి కర్నూల్ మరియు కడప జిల్లాల స్థాయి గ్రాండ్ పైనల్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మౌలానా ముఫ్తి హజరత్ సయ్యద్ అబ్దాల్ హుస్సైని ఖాద్రి సాహెబ్ మరియు పట్టణ సి ఐ. సుబ్బారాయుడు మరియు ఎస్ఐ. శంకర్ నాయక్ టిడిపి జిల్లా ముస్లిం మైనారిటీ సెల్ అధ్యక్షులు అత్తార్ జాహిద్ హుస్సేన్,  వైయస్సార్సీపి మైనారిటీ నాయకుడు డాక్టర్ మొహమ్మద్ హుస్సేన్ M.I.M పార్టీ ఇంచార్జ్ అమ్మబా విచ్చేసి పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు మరియు  ఉత్తీర్ణత సర్టిఫికెట్లు అందజేశారు.  హజరత్ సయ్యద్ అద్దాల్ హుసేని ఖాద్రి మాట్లాడుతూ ఈ పొటి ప్రపంచంలో విద్య అవసరమని ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు, సి ఐ సుబ్బారాయుడు మాట్లాడుతూ విద్యతో పాటు క్రమశిక్షణ  మంచి అలవాట్లు నేర్చుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు, లాల్ మస్జిద్ కమిటీ సభ్యులు మునవ్వర్, రఫీ, షేర్ ఖాన్, వెల్డింగ్ ఖలీల్, అమీర్ నాయక్, మక్బూల్ , అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు

ఘనంగా మదరసా నూరాని హాదియా మోడల్ స్కూల్ వార్షిక వేడుకలు
Back to top button