banaganapalli

బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం బనగానపల్లె నియోజకవర్గ నూతన ప్రధాన కార్యదర్శిగా గౌర ధర్మరావు ఎన్నిక చేసిన వంకిరి.రామచంద్రుడు

బనగానపల్లె (పల్లెవెలుగు) 04 ఫెబ్రవరి: స్థానిక బనగానపల్లెలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం కార్యాలయంలో బనగానపల్లె నియోజకవర్గ అధ్యక్షుడు అశ్వతు రామకృష్ణ ఆధ్వర్యంలో  నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిథిగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంకిరి.రామచంద్రుడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్.రియాజ్ హాజరవడం జరిగింది.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు వంకిరి.రామచంద్రుడు బనగానపల్లె నూతన ప్రధాన కార్యదర్శిగా గౌర  ధర్మారావు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది  అనంతరం నూతన కార్యదర్శిగా ఎన్నికైన గౌర ధర్మారావు గారు మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు వంకిరి.రామచంద్రుడు నాకు అప్పగించిన  ఈ పదవిని  నిర్వీర్యం చేయకుండా  విద్యార్థులకు, ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా ముందునుండి పోరాటం చేస్తామని ఆయన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా  ఆర్గనైజింగ్ సెక్రటరీ పాలుట్ల రమణ, గాబ్రియేలు రంగస్వామి తదితరులు పాల్గొన్నారు

Back to top button