
సేవే మా లక్ష్యం ఫలాహ్ ఫౌండేషన్
కర్నూలు జిల్లా, బనగానపల్లె మండలం, యనగండ్ల గ్రామానికి చెందిన చాంద్ బాషాకి నలుగురు సంతానం వీరిలో ముగ్గురు పుట్టుకతోనే ఆవిటి వారిగా జన్మించారు.
- హసన్…….27
- అమ్మాయి అప్రిన్..23
- మాబువాలి….22
వీరి తల్లిదండ్రులు.. చాంద్ బాషా, ఊసేన్ బీ వీరి నలుగురి సంతానంలో ఒక అమ్మాయికి పెండ్లి అయిపోయినది. మిగతా ముగ్గురు పుట్టుకతోనే ఆవిటి వారిగా జన్మించారు. వారికి అన్ని సేవలు చేయుటకు వారి తల్లిదండ్రులు ఎల్లపుడు వారి దగ్గరనే ఉండాలి. వేరే ఏదన్నా పనికి పోయేదానికి కుదరదు. వీరికి ఏ ఆధారము లేదు. ఈ పిల్లలు మూగివారు. జ్ఞాపక శక్తి ఉండదు. ఎపుడు పై ఫొటోలో ఉన్న విదంగానే పడి వుంటారు. పక్కకు కూడా స్వయంగా కదలలేరు. వారికి. గత కొన్ని రోజుల క్రితం బనగానపల్లె కు చెందిన కొంతమంది 15000 రూపాయలు ఆర్థిక సాయం అందించి ఫోటోను ఫేస్బుక్లో పెట్టడం జరిగినది. అది చూసిన ఫలహ్ ఫౌండేషన్ సభ్యులు వెంటనే స్పందించి వారి కుటుంబానికి 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు 2 బియ్యం బస్తాలు, కందిపప్పు, గోధుమపిండి, సేమియా పాకెట్లో, వంటనూనె కారం పసుపు వారి ఇంటి వద్దకు స్వయంగా తీసుకు వెళ్లి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫలాహ్ ఫౌండేషన్ యాన్.ఎండి ఫయాజ్ మాట్లాడుతూ మీరి పరిస్థితి చూస్తే కంటతడి పెట్టుకుంటారు ఎవరైనా మనసున్న దాతలు ఉన్న సహాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసరా సొసైటీ అధ్యక్షులు బాబా ఫక్రుద్దీన్, ఎంఐఎం పార్టీ ఇంచార్జ్ ఇస్మాయిల్ ఫలాహ్ ఫౌండేషన్ సభ్యులు మాలిక్, సల్మాన్, తారక్ తదితరులు పాల్గున్నారు.