
ఉపాధ్యాయుల ధర్నాను విజయవంతం చేయండి
ఆత్మకూరు పల్లెవెలుగు ఈ నెల 24వ తేదీన కర్నూలు లో జరిగే ఉపాధ్యాయుల మహాధర్నాను విజయవంతం చేయాలని ఫ్యాప్టో కన్వీనర్ జవహర్ నాయక్ కో కన్వీనర్స్ కిషోర్, జాకీర్ అన్నారు. సోమవారం ఆత్మకూరు పట్టణంలోని లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ఉర్దూ) మరియు వెంకటాపురం ఉన్నత పాఠశాలల్లో భోజన విరామ సమయంలో ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2018 వ సంవత్సరం నుంచి ఉపాధ్యాయులకు రావలసిన పి ఆర్ సి ని వెంటనే ప్రకటించాలని, ముఖ్యమంత్రి పాదయాత్ర సందర్భంగా సిపిఎస్ విధానం రద్దు చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని, పెండింగ్ లోఉన్న ఐదు డి.ఏ లను వెంటనే మంజూరు చేయాలని, నూతన జాతీయ విద్యా విధానం లోని లోపాలను సవరించాలని, ఉపాధ్యాయుల నెలవారి పదోన్నతులు చేపట్టాలని,రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న దాదాపు 25 వేల ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వారుకోరారు.కర్నూలు నగరంలో జరిగే మహా ధర్నాలో ఎక్కువ మంది ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు రాజ్ కుమార్, విధుభూషణ్, వెంకట రాములు నాయక్, జాకీర్ పాల్గొన్నారు.