SirvellaAbdul Javid

విద్యార్థి ఆరోగ్యానికి మెరుగైన వైద్య చికిత్స కోసం 12000/  ఆర్థిక సాయం

విద్యార్థి ఆరోగ్యానికి మెరుగైన వైద్య చికిత్స కోసం 12000/  ఆర్థిక సాయం

బాలుడి ఆరోగ్యం కోసం వెంకటాపురం గ్రామ ప్రజల తరఫున మరెన్నో సహాయ సహకారాలు…

గ్రామ సర్పంచ్ మల్లీశ్వరి ప్రసాద్ రెడ్డి

శిరివెళ్ళ (కోటపాడు) మండల పరిధిలోని కోటపాడు గ్రామంలో ఐదవ తరగతి చదువుతున్న నందు అనే విద్యార్థి అనారోగ్యంతో మంచాన పడటం వల్ల విద్యార్థికి మెరుగైన వైద్య చికిత్స కోసం  రూ.12000/_ఆర్థిక సాయం చేసినట్లు మల్లీశ్వరి ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఐదో తరగతి చదువుతున్న విద్యార్థి నందు కు ఆరోగ్యం సరిగా బాగాలేదని విషయం వెంకటాపురం సర్పంచ్ మల్లేశ్వరి ప్రసాద్ రెడ్డి తెలుసుకున్నారు. కోటపాడు గ్రామానికి చేరుకొని బాలునికి సంబంధించిన వ్యాధి, చికిత్స, అవసరమైన ఆర్థిక సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం మల్లీశ్వరి ప్రసాద్ రెడ్డి  మాట్లాడుతూ వెంకటాపురం గ్రామం ప్రజల తరఫున ఎవరైనా ఇబ్బందులు పడుతున్న సమయంలో వారిని ఆదుకోవడానికి తక్షణ సహాయం కింద ఆర్థిక సహాయం చేస్తామన్నారు.  ఈ బాలుడికి మరెన్నో సహాయ సహకారాలు  చేస్తామని, అతనికి సంబంధించిన అత్యవసర వస్తువులు కూడా అందజేస్తామన్నారు. ఆరోగ్య శ్రేయస్సుకోసం, ఎంతటి అయినను కృషి చేస్తామని, ఎవరైనా ఇబ్బందులు పడుతున్న సమయంలో తక్షణ కర్తవ్యంగా ఫోను సమాచారం ఇచ్చినా, వెంటనే స్పందించి, వారి ఇబ్బందులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. బాలుడికి ఈ సహాయం చేయడంతో తల్లి రమాదేవి మాట్లాడుతూ  వెంకటాపురం సర్పంచ్ మల్లేశ్వరి ప్రసాద్ రెడ్డి లకు అభినందనలు తెలపడమే కాక మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామనారు. ఈ కార్యక్రమంలో కోటపాడు, గ్రామ సర్పంచు దూదేకుల హుస్సేన్ బి గురప్ప, బీసీ సంఘం సంక్షేమ కార్యదర్శి బాల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Back to top button