Sirvella

వినాయక వుత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని సిఐ చంద్రబాబు నాయుడు

ఆళ్ళగడ్డ (పల్లెవెలుగు) 09 సెప్టెంబర్: స్థానిక నియోజకవర్గo లోని శిరివెళ్ల మండల కేంద్రంలో వినాయక వుత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని సిఐ చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గురువారం పోలీస్టేషన్ లో నిర్వహించిన పీస్ కమిటీ సమావేశంలో అన్ని మతాల పెద్దలతో సమావేశాన్ని సిఐ చంద్రబాబు నాయుడు, ఎస్సై శరత్ కుమార్ రెడ్డి లు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ వినాయక చవితి సందర్బంగా ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలి అని అలాగే మండపాల వద్ద మద్యం సేవించి పూజ కార్యక్రమాలలో పాల్గొనరాదని సూచించారు.అలాగే కరోనా మూడవ దశ ముప్పు ఉన్నందున కచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలని అన్నారు.అలాగే గణేష్ నిమజ్జనం సమయంలో గుంపులుగా పాల్గొనరాదని సాయంత్రం లోపల నిమజ్జనం ముగించాలని అన్నారు.కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా నాయకులు ఎస్వీ మోహన్ రెడ్డి,శిరివెళ్ల వైసిపి మండల నాయకులు సలాం గ్రామ పెద్దలు,మత పెద్దలు పాల్గొన్నారు.

Back to top button