
ఆరోగ్య అవగాహనా కార్యక్రమం
ఆరోగ్య అవగాహనా కార్యక్రమం
ఆళ్లగడ్డ (ఆంధ్రప్రతిభ) 06 జూన్: పి.నాగిరెడ్డి పల్లి లో ఆళ్లగడ్డ డాక్టర్స్ అసోసియేషన్ డాక్టర్స్ చే ఆరోగ్య అవగాహనా కార్యక్రమం జరిగింది. సుమారు 200 మంది పాల్గొన్న ఈ కార్యక్రమం లొ డాక్టర్ రామ గోపాల్ రెడ్డి పిల్లలకు, వారి తల్లి తండ్రులకు ఏ పనులు ఏ సమయం లొ ఏ వరుస క్రమం లో చేసుకోవాలో తెలియ జేశారు. పళ్ళు తోముకునే విషయం లో, స్నానం చేసే విషయాల గురించి, ఉదయం తీసుకోవలసిన ఆహారం గురించి విఫు లంగా చెప్పారు. డాక్టర్ ఉమాదేవి గారు ఆరోగ్యకరమైన, పుష్టి అయిన ఆహార పదార్థాల గురించి మరియు ఏ సమయంలో ఏవి తీసుకుంటే మంచి ఆరోగ్యాన్ని యిస్తాయో బాగా అర్థమయ్యేలా చెప్పారు. ఆయుర్వేద డాక్టర్ ప్రసాద్ మరియు డాక్టర్ సుదర్శన్ తగిన సూచనలు యిచ్చారు. డాక్టర్ వసంత, డాక్టర్ లక్ష్మి శేఖర్ రెడ్డి ఈ హాజరైనారు.గ్రామస్థులు ఈ కార్యక్రమం వల్ల చాలా తెలుకున్నామని, తమకు ఎంతో ఉపయోగ పడుతుంది అని సంతోషంగా చెప్పారు.