AllagaddaAbdul Javid

పాతాళ లిoగేశ్వర స్వామిఆలయములో జరిగిన ధ్వజ ప్రతిష్ట

పాతాళ లిoగేశ్వర స్వామిఆలయములో జరిగిన ధ్వజ ప్రతిష్ట

పి. నాగిరెడ్డి పల్లిలోని పాతాళ లిoగేశ్వర స్వామిఆలయములో జరిగిన ధ్వజ ప్రతిష్ట కార్యక్రమములో పాల్గొన్ననంద్యాల మాజీ యంపి గంగుల ప్రతాప రెడ్డీ, కేంద్ర కాటన్ బోర్డు మాజీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి.

ఆళ్లగడ్డ (పల్లె వెలుగు) 19 ఏప్రిల్: స్థానిక మండలం లోని పి.నాగిరెడ్డిపల్లి గ్రామములోని ధ్వజ శిఖరనందీశ్వర ప్రతిష్ఠా కార్యక్రమము వేద పండితులు బ్రహ్మ శ్రీ. వాసాపురం రామయ్య ఆధ్వర్యం వైభవంగా నిర్వహించారు. మూడురోజుల పాటు రుత్వికులచే యంత్రప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠమూల విరాట్ కు మహా న్యాస పూర్వక రుద్రాభిషేకం కార్య క్రమాలు జరిగాయి. సోమవారం నాడు ప్రతిష్ఠ శిఖర, ధ్వజనందీశ్వర ప్రతిష్ఠ,  ప్రాప్రతిష్ఠ, కళా వాహనం, గోదర్శనం, కక్ష జ్వల, పూర్ణాహుతి , మహా మంగళ హారతి కార్యక్రమాలు కన్నుల పండుగగా వేదపండితులు నిర్వహించారు. మహా పూర్ణాహుతి కార్య క్రమములో ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే కీ.శే. సిపి తిమ్మారెడ్డి కుటుంబ సభ్యులు సి.రామకృష్ణా రెడ్డి, సి.రామ చంద్రా రెడ్డి, డా.సి రామ గోపాల్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు సి శివశంకర్ రెడ్డి,  చంద్రశేఖర్ రెడ్డి, రామ మద్దులేటి రెడ్డి, కేంద్ర కాటన్ బోర్డు మాజీ డైరెక్టర్ చింతకుంట శ్రీనివాసరెడ్డి, సి. జయ కృష్ణా రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యములో శివాలయంలో ధ్వజ ప్రతిష్ఠా కార్యక్రమాలు నిర్వహిoచారు. గ్రామములో జరిగిన ధ్వజ ప్రతిష్ఠా, మహా పూర్ణా హుతీ కార్యక్రమములో నంద్యాల మాజీ యంపి. గంగుల ప్రతాపరెడ్డి పాల్గొని  ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Back to top button