Allagadda

బ్రహ్మోత్సవాలు సందర్భంగా అహోబిలం పరిసరాల్లో శరమదానం

బ్రహ్మోత్సవాలు సందర్భంగా అహోబిలం పరిసరాల్లో శరమదానం

ఆళ్లగడ్డ (పల్లెవెలుగు) మర్చి 02 : బ్రహ్మోత్సవాలు సందర్భంగా అహోబిలం పరిసరాల్లో నిర్వహించిన శరమదానం కార్యక్రమం నేటితో ముగిసింది. గత వారం రోజులుగా (24.-02-2022 నుండి 2-03-2022) ఎగువ అహోబిలం వరాహ నరసింహ స్వామి దేవాలయం దగ్గర, మరియు మండపం, కారింజ నరసింహ స్వామి, అదేవిధంగా దిగువ అహోబిలం , కోనేరు, సచివాలయం వెనుక భాగం లో, పోలీసు అవుట్ పోస్టు దగ్గర, దేవాలయం చుట్టు పక్కల, తిరుపతి తిరుమల దేవస్థానం ఆవరణలో, ఏ.పి.టూరిజం దగ్గర, కరెంట్ ఆఫీస్ ఆవరణలో, బాచుపల్లె రోడ్డు వాహనాల పార్కింగ్, ఆర్టీసీ మైదానంలో కంప చెట్లు , చెత్త , ప్లాస్టిక్ కవర్లు  తొలగించడం జరిగింది.  E.O నరసయ్య మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు సందర్భంగా NSS విద్యార్థులు మరియు సమన్వయకర్త డా.గంగన్న మాకు మంచి సమయంలో బాగా శ్రమదానం చక్కగా చేయడం వల్ల అంతా అహోబిలం పరిసరాలు పరిశుభ్రంగా వుంచడం జరిగిందన్నారు. దేవాలయ (మఠం) మేనేజర్ సంపత్ మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల NSS విద్యార్థులు ఇక్కడ శ్రమదానం  చేయడం వల్ల ఎంతో  పుణ్యం లభిస్తుంది అని  విద్యార్థులను అభినందించారు. మరియు సమన్వయకర్త డా. గంగన్న మాట్లాడుతూ మేము మా విద్యార్థులు అహోబిలం నరసింహస్వామి సన్నిదిలో చేయడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రూరల్  S.I నర్సింహులు  మరియు KDCC చైర్మన్ నాసారి వెంకటేసులు , రమేష్ అయ్య భద్రయ్య విద్యార్థులు సుబ్బయ్య  తదితరులు పాల్గొన్నారు.

Back to top button