Allagadda

ఘనంగా సీనియర్ సిటిజన్స్ డే

ఘనంగా సీనియర్ సిటిజన్స్ డే

ఆళ్లగడ్డ (పల్లెవెలుగు) 02 ఫెబ్రవరి: ఆళ్ళగడ్డ శాఖా గ్రంథాలయం నందు సోమవారం సీనియర్ సిటిజన్స్ డే మరియు డా అంబేడ్కర్ సతీమణి రమాదేవి జయంతి వేడుకలు జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రంథాలయాధికారి వజ్రాల గోవిందరెడ్డి పాఠకులు కలిసి ముందుగా అంబేద్కర్ రమాదేవి చిత్రపటంకు పూలమాల వేసి వారి సేవా భావం గురించి మాట్లాడుతూ అంబేద్కర్ జీవితంలో రానించడానికి వారికి సహకరించుకుంటూ వారితో సమాజ సేవలో పాల్గొన్నారని కొనియాడారు. వారు ధేశానికి మంచి రాజ్యాంగంను అందించి చిరంజీవులయ్యారన్నారు. సిటిజన్స్ కొద్ది మంది పాల్గొని సమాజంలో మనము కూడా అంబేద్కర్ దంపతులు మార్గంలో నడుచుకోవాలని తెలుపుకంటూ రమాదేవి అంబేద్కర్ లకు నివాళులు అర్పించారు. తదనంతరము పాఠకులు సీనియర్ సిటిజన్స్ అందరూ పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈశ్వరయ్య పాండు, రాజు, సుదర్శన్ భాస్కర్, సూర్య గౌస్ , చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Back to top button