Allagadda

ఘనంగా దివంగత భూమా నాగిరెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా దివంగత భూమా నాగిరెడ్డి జన్మదిన వేడుకలు

ఆళ్లగడ్డ (పల్లెవెలుగు) 08 జనవరి: నియోజకవర్గం దివంగత భూమా నాగిరెడ్డి 58వ పుట్టిన రోజు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని భూమాఘాట్ ను సందర్శించి భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డి  విగ్రహాలకు నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి , పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం భూమా కిషోర్ రెడ్డి భూమా దంపతులు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు, భూమా దంపతుల కుమారుడు భూమా జగద్విఖ్యాత రెడ్డి కుటుంబ సభ్యులు అభిమానులు, శ్రేయోభిలాషులతో కలిసి తల్లిదండ్రుల విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సేవే పరమావధిగా చేశారని ఆళ్లగడ్డ నంద్యాల రెండు కళ్ళని నియోజకవర్గాలఅభివృద్ధికి ఎనలేని కృషి చేసిన మహనీయులని వారి అడుగుజాడల్లో నడవాలని  ఆశయ సాధనకు ఎప్పుడూ ముందుంటామని వారు పేర్కొన్నారు. నియోజకవర్గంలో రక్తదాన శిబిరాలు తదితర కార్యక్రమాలు జరిగాయి

Back to top button