Allagadda

ఆళ్లగడ్డ వాసికి సావిత్రి భాయి ఫూలే ఎక్సులెన్సు అవార్డు

ఆళ్లగడ్డ వాసికి సావిత్రి భాయి ఫూలే ఎక్సులెన్సు అవార్డు

రుద్రవరం (పల్లెవెలుగు) 05 జనవరి: మండల పరిధిలోని ముత్తలూరు గ్రామ సచివాలయ మహిళ పోలీస్ వి. లలితమ్మ కు సావిత్రి భాయి ఫూలే ఎక్స్ లెన్స్ అవార్డు ని అందుకున్నారు. మహాత్మాజ్యోతిరావు ఫూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం నాడు తిరుపతి లో నిర్వహించిన సావిత్రి భాయి ఫూలే జయంతి కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత సుమన్ తల్వార్, కులమత రహిత సర్టిఫికెట్ పొందిన మొదటి భారతీయ మహిళ స్నేహపార్దీభా రాజన్ చేతుల మీదుగా v.లలితమ్మ ఈ అవార్డు అందుకున్నారు. మహిళ సంరక్షణ కార్యదర్శి గా చేసిన సేవలకు ఈ అవార్డు రావటం ఎంతో ఆనందం గా ఉందని ముత్తలూరు మహిళ పోలీస్ వి. లలితమ్మ తెలిపారు. ఈ అవార్డు అందుకున్నందుకు మహిళ పోలీస్ వి. లలితమ్మ ని సచివాలయ సిబ్బంది ముత్తలూరు గ్రామ ప్రజలు ఆమె పట్ల హర్షం వ్యక్తం చేసారు. వి. లలితమ్మ ఇంకా ఇలాంటి అవార్డులు ఎన్నో అందుకోవాలని ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు చేరాలని ముత్తలూరు గ్రామ ప్రజలు ఆమెను అభినందించారు

Back to top button