AllagaddaAbdul Javid

మానసిక ఉల్లాసానికి క్రీడలు అవసరం

మానసిక ఉల్లాసానికి క్రీడలు అవసరం
జే సాప్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రసాద్

 ఆళ్లగడ్డ (పల్లెవెలుగు) డిసెంబర్ 26 : పిఆర్ విజయ భాస్కర్, పి సురేష్ పీఈటీల స్మారకార్థం ఈ నెల 25న బాల్ బ్యాడ్మింటన్ మరియు అథ్లెటిక్స్ పోటీలను ప్రారంభించారు. పట్టణంలోని వై.పి.పి ఉన్నత పాఠశాల మైదానంలో 2 రోజులు జరిగిన పోటీలు  ఆదివారం నాడు ముగిసాయి. గెలుపొందిన విజేతలు బాల్ బ్యాడ్మింటన్ లో మొదటి బహుమతి  నంద్యాల 6000, ద్వితీయ బహుమతి మర్రిపల్లె 5,000,  నంద్యాల నంది పైర్స్ తృతీయ బహుమతి 4000 , క్రిష్టిపాడు చతుర్ధ బహుమతి 3000 ,అలాగే అథ్లెటిక్స్ అండర్ 8  విశ్వనాధ్, హారిక, లక్ష్మి ప్రియ అండర్ 10 హరీష్, మేఘన, చైతన్య అండర్ 14 మహీధర్, సుప్రజా, లత గెలుపొందారు.  జే సాఫ్ రాష్ట్రఉపాధ్యక్షుడు మాటివి ఓబులంప్రసాద్, గెలుపొందిన క్రీడాకారులకు కప్పును బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా మాటీవీ ఓబుళం ప్రసాద్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి దేహ దారుఢ్యానికి మేధస్సుకు దోహదపడతాయని చిన్నతనం నుండే చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమన్నారు, నేటి ఓటమే  రేపటి విజయానికి నాంది అన్నారు .ఈ సందర్భంగా విజయ సాధన స్పోర్ట్స్ కోచింగ్ సెంటర్ వారిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో క్రీస్తు శేషులు సురేషు తల్లి తండ్రులు సాల్మన్ మరియు విజయ సాధన నిర్వాహకులు సుబ్బరాయుడు న్యాయవాది సుభాన్, రామకృష్ణ, కుళాయి స్వామి, సదా, వెంకట్, జాఫర్ చింతల శేఖర్  వైపిపియం హెచ్ఎం వెంకటరామిరెడ్డి, ఎస్ సీతారామయ్య, రషీద్ పాల్గొన్నారు,

Back to top button