Allagadda

షావుకారిపేట విద్యుత్తు స్థంభాన్ని తొలగించేoదుకు ఎమ్మెల్యే కు వినతి

షావుకారిపేట విద్యుత్తు స్థంభాన్ని తొలగించేoదుకు ఎమ్మెల్యే కు వినతి

ఆళ్లగడ్డ (పల్లెవెలుగు) డిసెంబర్16 :  పట్టణములోని షావుకారి పేటకు మొదట్లో ఉన్నవిద్యుత్తు స్థంభాన్ని మార్చాలని ఆళ్లగడ్డ వైసిపి నాయకులు సునీల్ కుమార్, ఆళ్లగడ్డ ఆర్యవైశ్య సంఘము అధ్యక్షుడుటి. వినోద్ కుమార్లు స్థానిక ఎమ్మెల్యే గంగుల బిజేoధ్రారెడ్డి దృష్టికి తీసుకొని పోగా ఆయన వెంటనే స్పందించి షావుకారి పేట్ వీధికి వచ్చిపరిశీలించి, అక్కడిక్కడే విద్యుత్తు శాఖ అధికారులను పిలిపించి ఆదేశాలు జారీ చేయటంతో ఆళ్లగడ్డ వైసిపి నాయకులు కొత్తూరు సునీల్ కుమార్, ఆళ్లగడ్డ 12వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ కె. వరాలమ్మ ఆళ్లగడ్డ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు టి.వినోద్ కుమార్, ఆళ్లగడ్డ శ్రీ వాసవీ యువజన సంఘం అధ్యక్షుడు గుండా రవికుమార్, ఆళ్లగడ్డ ఆర్య వైశ్యులు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలియ జేశారు.

Back to top button