AllagaddaMohammad Rafi

గోతులు తీశారు-నిర్మాణం మరిచారు

గోతులు తీశారు-నిర్మాణం మరిచారు

ఆళ్ళగడ్డ పల్లెవేలుగు:03డిసెంబర్ మురికి కాలువల నిర్మాణం చేస్తామంటూ ఆర్భాటంగా పట్టణంలోని 8వ వార్డులో గల సద్దాం కాలనీలో ఇళ్ల ముందు గోతులు తీసిన మున్సిపాలిటీ అధికారులు ఆనక కాలువ నిర్మాణం చేపట్టాక పోవడంతో ప్రజల అనేక ఇబ్బందులకు గురౌతున్నారు.వృద్దులు,మహిళలు,పిల్లలు కాలువ నిర్మాణం కోసం తీసిన గోతుల్లో పడి ప్రమాదాలకు గురౌతున్నారు..అసలే ఇరుకు విధులు ఆపై ఆక్రమణలకు పాల్పడి నిర్మించుకున్న గృహాలు ఇప్పుడు కాలువల నిర్మాణం అంటూ తీసిన గోతుల వల్ల చిన్న వాహనాలకు సైతం రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా ఉందని వాపోతున్న కాలనీ వాసులు..

కాంట్రాక్టర్ నిర్మాణానికి సిద్ధంగా ఉన్నా మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం

ఎక్కడైనా ప్రభుత్వ నిర్మాణాలకు కాంట్రాక్టర్ నిర్మాణం చేయడంలో పలు కారణాలతో జాప్యం జరుగుతుంది.కానీ సద్దాం కాలనీలో కాంట్రాక్టర్ కాలువ నిర్మాణానికి సిద్ధంగా ఉన్న కేవలం మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మురికి కాలువల నిర్మాణంలో జాప్యం జరుగుతోందని కాలనీ వాసులు,కౌన్సిలర్,వార్డ్ ఇన్ఛార్జ్ లు ఆరోపిస్తున్నారు…

ఆక్రమణ దారులవల్లే నిర్మాణంలో జాప్యం

సద్దాం కాలనిలో ఒకరు ఆక్రమణకు పాల్పడి దాదాపు నాలుగు అడుగుల మేర మున్సిపాలిటీ స్థలాన్ని అక్రమించుకోవడం వల్ల కాలువ నిర్మాణం చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆక్రమణ దారుల కట్టడాలు తొలగించకుండా కాలువ నిర్మాణం చేయడానికి మున్సిపాలిటీ అధికారులు ప్రణాళికలు చేస్తూన్నట్టు సమాచారం.. ఎన్నో సంవత్సరాల నుండి మురుగు  కాలువలు లేక మురుగునీరు, వర్షపు నీరు నిలబడి ఇళ్ల ముందు మాడుగుల నిలబడి దోమలు,పాములు,విషాకిటకాల సంచారంతో కాలనీ వాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.వార్డ్ కౌన్సిలర్ ముబీన్,వార్డ్ ఇంచార్జ్ ఆజాద్ కృషితో సద్దాం కాలానికి మురుకి కాలువలు మంజూరు అయిన..ఆక్రమణకు పాల్పడి కట్టడాలు నిర్మించుకున్న కేవలం ఒక్కరి కోసం మురికి కాలువ నిర్మాణంలో జాప్యం జరుగుతుండటం సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి..

ఇరుకుగా ఉన్న కాలనిలోకి అంబులెన్స్ కూడా రాలేని దుస్థితిలో వ్యక్తి మృతి.

మురికి కాలువలెక్ నిర్మాణం కోసం కాలనిలో తీసిన గోతులవల్ల అసలే ఇరుకుగా ఉన్న వీధులు మరింత ఇరుకుగా మారి గుండె నొప్పితో బాధపడుతున్న మహిళను అత్యవసరంగా ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు  ఆంబులెన్స్ కూడా రాలేక వచ్చినా ఆ ఇరుకు వీధిలో అంబులెన్స్ ను త్రిప్పుకోవడం కష్టాంగ మారి దాదాపు గంటకు పైగా సమయం పట్టడంతో ప్రాణాపాయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న సదరు మహిళ చనిపోవడం జరిగిందని కాలనీ వాసులు ఘొల్లు మంటున్నారు. ప్రతి నిత్యం కాలువల కోసం తీసిన గోతులను దాటుకుని ఇళ్ల లోనికి వెళ్లాలంటే వృద్దులు,మహిళలు,చిన్న పిల్లలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని కాలనీ ప్రజలు వాపోతున్నారు.ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు స్పందించి ఆక్రమణలను తొలగించి కాలువల నిర్మాణం చేపట్టాలని కాలనీ ప్రజలు కోరుకుంటున్నారు…

పరిస్థితిని మున్సిపాలిటీ అధికారులకు తెలిపిన పట్టించుకోవడం లేదు..కౌన్సిలర్,వార్డ్ ఇంచార్జ్

కాలనీ లో పరిస్థితిని ఎన్నిసార్లు మున్సిపాలిటీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన వారు రేపు మర్నాడు అంటూ జాప్యం చేస్తున్నారని వార్డ్ కౌన్సిలర్ ముబీన్,వార్డ్ ఇంచార్జ్ ఆజాద్ తెలియజేశారు.కాలువలు లేక వార్డ్ ప్రజలు పట్లడుతున్న కష్టాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి కాలువను మంజూరు చేయించుకున్న కేవలం మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్య కారణంగా వార్డులో మురికి కాలువలెక్ నిర్మాణంలో జాప్యం జరుగుతోందని ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు స్పందించి ఆక్రమణలు తొలగించి మురికి కాలువ నిర్మాణం చేయాలని వార్డ్ అభివృద్ధికి సహకరించాలని వారు కోరుకున్నారు…

కాలనీ ప్రజలలో ఒకరు డైరెక్ట్ గా ఒక్కరి కోసం కాలువ నిర్మాణం ఆపడం ఏంటని.. ప్రశ్నించారు.అలాగే ఎవరైతే ఆక్రమణకు పాల్పడ్డారో వారు కూడా  మున్సిపాలిటీ అధికారులకు సహకరిస్తామని ఎక్కడికి కావాలంటే అక్కడివరకు తొలగిస్తామని చెప్పడం జరిగింది

Back to top button