Allagadda

ఆజాదీ కా అమృత మహోత్సవం

ఆళ్లగడ్డ (పల్లెవెలుగు) 06 నవంబర్: పాన్ ఇండియా అవేర్నెస్ అండ్ outreach program ఆజాదీ కా అమృత మహోత్సవం కార్యక్రమంలో భాగంగా సుప్రీం కోర్టు వారి ఆదేశాల మేరకు మండల న్యాయ సేవా సంఘం అధ్యక్షులు మరియు ఐదవ అదనపు జిల్లా జడ్జి డి అమ్మన్న రాజా ఆధ్వర్యంలో ఓబులంపల్లె గ్రామం నందు సచివాలయం దగ్గర న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు. న్యాయ సేవలు ప్రతి ఒక్కరికి చేరువలో ఉంటాయని ఆర్థికంగా వెనుకబడిన, ఎస్సీ ఎస్టీలకు, స్త్రీలకు ఉచిత న్యాయ సేవలు అందిస్తామని అయిదవ అదనపు జిల్లా జడ్జి గారు తెలియజేశారు. లోక్ అదాలత్ ల ద్వారా కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను కూడా రాజీ చేసుకునే సదుపాయం ఉన్నదని, ఈ యొక్క న్యాయ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించు కోవాలని ఐదవ అదనపు జిల్లా జడ్జి తెలియజేశారు. అలాగే డిసెంబర్ 11 వ తారీకు న జరిగే జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోర్టులలో ఉన్న పెండింగ్ లో ఉన్న రాజీ అయ్యే  కేసులను జాతీయ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకో వలసిందిగా వారు తెలియజేశారు. సుప్రీం కోర్టు వారి ఆదేశాల మేరకు ఇంటింటికీ న్యాయ సేవలు అనే కార్యక్రమాలను చేపడుతున్నామని ఇందులో పైన న్యాయవాదుల ద్వారా గ్రామ గ్రామాన న్యాయ సేవల గురించి తెలియజేస్తున్నామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీపీలు సోమశేఖర్ రెడ్డి,  ప్రభాకర్ రెడ్డి, ఏ జిపిఎం షడ్రక్, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు మురళీధర్, సీనియర్ న్యాయవాదులు శివరామి రెడ్డి, నీలకంటేశ్వరం , ఆళ్లగడ్డ రూరల్ ఎస్సై నరసింహులు, జూనియర్ న్యాయవాదులు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Back to top button