Allagaddanaga ashok

మహాదేవపురం లో స్వచ్ఛభారత్ ర్యాలీ

మహాదేవపురం (పల్లెవెలుగు) 22 అక్టోబర్: మండల పరిధిలోని మహదేవ పురంలో శుక్రవారం స్వచ్ఛ భారత్ పై ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ గ్రామ సర్పంచ్ పెద్ది రమణయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామమంతా పరిశుభ్రంగా ఉంచాలని తెలియజేశారు. అంటు వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామ పరిశుభ్రత ముఖ్యమంత్రి ఆశయం అన్నారు.ప్రతి వీధిలో మొక్కలు నాటి దాని సంరక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు. ఈనాటి పరిశుభ్రతే ఆరోగ్యానికి నాంది. ఈ కార్యక్రమంలో సచివాలయ అధికారులు సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Back to top button