Allagadda

దొర్నిపాడు గ్రామ సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ .

  • ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించండి .
  • దొర్నిపాడు మండలంలోని గోవిందిన్నె గ్రామము మరియు గుండుపాపల గ్రామాలలో పాల శీతలీకరణ భవనాల నిర్మాణం కొరకు భూములను పరిశీలించాము.
  • నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్

దొర్నిపాడు అక్టోబర్ 21 :-  దొర్నిపాడు గ్రామ సచివాలయం ను నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ . ఆకస్మికంగా తనిఖీ గావించారు. గురువారం  మండల కేంద్రంలోని గ్రామ సచివాలయాల మరియు దొర్నిపాడు మండలంలోని గోవిందిన్నె గ్రామము మరియు గుండుపాపల గ్రామాలలో పాల శీతలీకరణ భవనాల నిర్మాణం కొరకు భూములను నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్.  దొర్నిపాడు తహసిల్దార్ జయ ప్రసాద్ తో కలిసి పరిశీలించారు. నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ ఈ రోజు సచివాలయంలో సిబ్బంది హాజరు పట్టిక, సంక్షేమ పథకాల క్యాలెండర్, ఎస్ఎల్ఏ గడువు లోగా ప్రజా సమస్యల పరిష్కార చర్యల నివేదిక, ప్రభుత్వ పథకాల పోస్టర్ లు తదితర వాటిని సబ్ కలెక్టర్ పరిశీలించారు. ఇప్పటి వరకు సచివాలయానికి ఎన్ని సర్వీసులు వచ్చాయి, ఎన్ని సర్వీసులకు పరిష్కారం చూపించారు అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. సచివాలయ పరిధిలో ఎంత మంది జనాభా ఉన్నారు, అందులో ఎంత మంది పురుషులు…మహిళలు… పిల్లలు…ఉన్నారు…ఎంత మందికి పెన్షన్ వస్తుంది, తదితర వివరాలన్ని తమ దగ్గర ఉండాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. సచివాలయం పరిధిలో ఎంత మందికి వ్యాక్సిన్ ఇచ్చారు…45 సంవత్సరాల పైబడిన వారు ఎంత మంది పురుషులు, మహిళలు ఉన్నారు… వారిలో ఎంత మందికి మొదటి డోస్ వ్యాక్సిన్ ఇచ్చారు… ఇంకా రెండవ డోస్ ఎంత మంది వేయించుకోవాలి వంటి వివరాలను ఏఎన్ఎంను అడిగి తెలుసుకున్నారు. గర్భిణీలకు వ్యాక్సినేషన్ ఇవ్వడం చాలా అవసరమని…ఆ దిశగా మీ పరిధిలోని గర్భిణీలను  మోటివేషన్ చేసి వ్యాక్సినేషన్ ప్రక్రియ వంద శాతం పూర్తి చేయాలని ఏఎన్ ఎంకు సబ్ కలెక్టర్ ఆదేశించారు.

తమ గ్రామ పరిధిలోని మహిళలకు దిశా యాప్ పై అవగాహన కల్పించాలని మహిళా పోలీస్ ను సబ్ కలెక్టర్ ఆదేశించారు. ఉన్న ఊర్లో ఉద్యోగం చేసే అవకాశం వచ్చిందని….మీ పట్టణం లో ఉన్న ప్రజలకు మంచి సేవలు అందించి ప్రజల నుంచి మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. ప్రజల దగ్గరగా ఉంటూ మెరుగైన సేవలు అందించడంతో పాటు సచివాలయానికి వచ్చే సర్వీసులకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపించాలని సబ్ కలెక్టర్ గ్రామ సచివాలయ ఉద్యోగులకు సూచించారు. ప్రజలకు జాప్యం లేకుండా ప్రభుత్వ సేవలను పారదర్శకంగా అందించాలని  సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ప్రజలకు అవసరమైన అన్ని రకాల సేవలను ఇంటి వద్దనే అందించేందుకు సచివాలయ వ్యవస్థ అనేది చాలా కీలకమన్నారు.

అనంతరం దొర్నిపాడు మండలంలోని గోవిందిన్నె గ్రామము మరియు గుండుపాపల గ్రామాలలో పాల శీతలీకరణ భవనాల నిర్మాణం కొరకు భూములను సబ్ కలెక్టర్ పరిశీలించారు

Back to top button