
ఆళ్లగడ్డ వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ డైరెక్టర్ పరమేశ్వరరెడ్డి మృతి.
రుద్రవరం (పల్లెవెలుగు) 29 సెప్టెంబర్: ఆళ్లగడ్డ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పరమేశ్వర రెడ్డి(50) బుధవారం నాడు అనారోగ్యంతో మృతి చెందారు. చిన్న కంబలూరు గ్రామానికి చెందిన పరమేశ్వర రెడ్డి గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ నంద్యాల లోని శాంతారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కోలుకోలేక బుధవారం నాడు మృతి చెందారు. వైయస్సార్ సిపి లో చురుకైన నాయకుడిగా గుర్తింపు పొంది పార్టీ గెలుపు కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని వైసిపి నాయకులు అన్నారు.
పరమేశ్వర రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు
పరమేశ్వర రెడ్డి మృతి పార్టీకి తీరని లోటని వైసిపి సీనియర్ నాయకుడు గంధం రాఘవరెడ్డి అన్నారు. బుధవారము ఆయన మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వైసిపి నాయకులు నర్సిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కో ఆప్షన్ నెంబర్ మాదార్ సాహెబ్ ఇతర నాయకులు నివాళులర్పించారు.