Allagadda

ప్రమాదవశాత్తు కాలవలో పడి వ్యక్తి మృతి

రుద్రవరం (పల్లెవెలుగు) 28 సెప్టెంబర్: మండలంలోని బి నాగిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన నల్లవారి నల్లన్న(58) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు కాల్వలో పడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు నల్ల వారి నల్లన్న కూలిపని చేస్తూ జీవించేవాడు అన్నారు. ఈ వ్యక్తి గ్రామ సమీపంలోని వరి పంట పొలంలో పనులు చేసి సోమవారం సాయంత్రం ఇంటికి వస్తు కాళ్లు చేతులు కడుక్కోవడానికి గురప్ప స్వామి గుడి సమీపంలో ఉన్న కాలువలో ధిగ గా నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అందులో చిక్కుకొని నీటిలో మునిగి మృతిచెందాడని మృతుని బంధువులు ఫిర్యాదు చేశారన్నారు. మృతునికి  భార్య లచ్చమ్మ ముగ్గురు కుమారులు కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్ఐ శోభన్ బాబు తెలిపారు.

Back to top button