Allagaddanaga ashok

శ్రీవాసా పురం వెంకటేశ్వర స్వామి దేవస్థానమునకు బీరువా విరాళం

రుద్రవరం (పల్లెవెలుగు) 25 సెప్టెంబర్: మండలంలోని కొండ మాయ పల్లి, వెలగల పల్లె పొలిమేర లో వెలసిన శ్రీ వాసాపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానం బీరువాను విరాళం దాతలు అందజేసినట్లు దేవస్థానం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామికి ఉదయం కుంకుమార్చన, ధూప , దీప నైవేద్యాలు పూజా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. రుద్రవరం గ్రామానికి చెందిన దాతలు లింగం శ్రీనివాసులు ఆయన భార్య కళావతి వెంకటేశ్వర స్వామి గుడికి విరాళంగా బీరువాను అందజేశారన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానము ఉపాధ్యక్షులు లింగం వెంకట రంగనాయకులు శెట్టి, వంక దార శ్రీనివాసులు శెట్టి తదితరులు పాల్గొన్నారు.

Back to top button