Allagadda

ZPTC/MPTC ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రం ను పరిశీలించిన నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్

ఆళ్లగడ్డ (పల్లెవెలుగు) సెప్టెంబర్ 17 : ZPTC/MPTC ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రంను నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ పరిశీలించారు. శుక్రవారం ఆళ్లగడ్డ పరిధిలోని ఆళ్లగడ్డ, రుద్రవరం, దొర్నిపాడు, చాగలమర్రి, ప్రాంతాలకు  సంబంధించిన ZPTC/MPTC ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రమైన కే పి జి ఇంగ్లీష్ మీడియం పాఠశాల (పడకండ్ల) ను నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్. ఆళ్లగడ్డ తహసీల్దార్ జి రమేష్ రెడ్డి. రుద్రవరం తహసీల్దార్ వెంకట శివ. చాగలమర్రి తహసీల్దార్, చంద్రశేఖర్ నాయక్, ఆళ్లగడ్డ ఎంపీడీవో అక్రమ్ భాష, రుద్రవరం ఎంపీడీవో, వరలక్ష్మి లతో కలసి పరిశీలించారు. అనంతరం నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ  శ్రీయుత జిల్లా కలెక్టర్ వారి ఆదేశానుసారం ZPTC/MPTC ఎన్నికల ఓట్ల లెకింపు కొరకు ఈరోజు ఈ పాఠశాల లో ZPTC/MPTC ఎన్నికల ఓట్ల  లెక్కింపుకు గాను పాఠశాలను పరిశీలించి నామన్నారు. లెక్కింపు సమయంలో విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని సక్రమ రీతిలో బ్యారిగేట్లు ఏర్పాటు చేయాలని మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను  సబ్ కలెక్టర్ ఆదేశించారు.

Back to top button