Allagadda

హిందూ సోదరులు మనోభావాలను దెబ్బతీయకుండా ఉత్సవాలను జరుపుకునేందుకు ఆళ్లగడ్డ పట్టణంలో పర్మిషన్ ఇవ్వాలి – శంసుల్ హాక్

ఆళ్లగడ్డ (పల్లెవెలుగు) 07 సెప్టెంబర్:  గణపతి ఉత్సవాలకు ఆంక్షలు విధించడం హిందువుల మనోభావాలను దెబ్బ తీయడం వెంటనే గణేష్ ఉత్సవాలను విగ్రహాలు కూర్చోబెట్టడానికి మరియు నిమజ్జనం చేయడానికి ఎలాంటి ఆంక్షలు లేని పర్మిషన్ ఇవ్వాలి ఈ దేశంలో అన్ని మతస్తులకు వారి వారి సంప్రదాయబద్దమైన పండుగ జరుపుకునే ప్రాథమిక హక్కులను కలిగి ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాము హిందూ సోదరులు మనోభావాలను దెబ్బతీయకుండా ఉత్సవాలను జరుపుకునేందుకు ఆళ్లగడ్డ పట్టణంలో పర్మిషన్ ఇవ్వాలి హిందూ ధార్మిక సంస్థలు చేస్తున్న మీ పోరాటాలకు మా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని శంసుల్ హాక్ కాంగ్రెస్ మైనారిటీ నేత డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హుస్సేన్ భాష జిల్లా నాయకులు సి.పుల్లయ్య పట్టణ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్  చంద్ బాషా రఘువ పాల్గొన్నారు

Back to top button