Allagaddanaga ashok

మృతి చెందిన గ్రామ వాలంటరీ కుటుంబానికి వైయస్సార్ బీమా ఆర్థిక సహాయం

సిరివెళ్ల (పల్లెవెలుగు) 6 సెప్టెంబర్ :  గోవింద పల్లి గ్రామానికి చెందిన గ్రామ వాలంటరీ శివ కుమార్ గుండెపోటుతో ఆదివారం నాడు రాత్రి మృతి చెందాడు.  వెంటనే సమాచారం తెలుసుకున్న వైకాపా నాయకుడు ప్రతాపరెడ్డి,గ్రామ సర్పంచ్ ,ఉప సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ మృతి చెందిన గ్రామ వాలంటరీ ఇంటి వద్దకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.  అనంతరం తమ వంతు సాయంగా మృతిచెందిన గ్రామ వాలంటరీ కుటుంబ సభ్యులకు వైఎస్సార్ బీమా కింద పదివేల రూపాయలు నగదు పంపిణీ చేశారు.  అనంతరం వారు మాట్లాడుతూ విలువనే ఊపిరిగా, మంచి మానవత్వమే తన అభిమతంగా ,జీవన ప్రయాణం కొనసాగించి ఆదివారం రాత్రి తిరిగిరాని లోకాలకు శాశ్వత దూరాలకు వెళ్ళిన వాలంటరీ శివ కుమార్ గారి మంచి, మానవత్వం, క్రమశిక్షణ, గురించి గోవింద పల్లె  గ్రామ ప్రజలలో కాక అధికారులు కూడా చర్చించుకుంటున్నారు. వాలంటరీ శివ కుమార్ గారి మంచితనం,ప్రేమ, దయ, కరుణ వంటి ఉత్తమ లక్షణాలు కలిగి ఉన్నటువంటి అతడు  మనతో స్నేహంగా కలిగి ఉండడం ఎంతో గర్వ తగ్గ విషయం. శివ కుమార్ గారి మానవత్వం, సేవాగుణం, కుల మత వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరినీ ప్రేమ అనురాగాలతో పలకరిస్తూ, చేతనైన సహాయం చేస్తూ గ్రామంలో మంచి మనసున్న వాలంటరీగా పేరుప్రఖ్యాతులు  సంపాదించుకున్నాడన్నారు. మృతిచెందిన వాలంటరీ కుటుంబ సభ్యులను అన్ని రకాలుగా ఆదుకుంటామని సంక్షేమ పథకాలు అందించి వారి కుటుంబానికి సహకరిస్తామని హామీ ఇచ్చారన్నారు.

Back to top button