
Allagaddanaga ashok
బ్యాంకు, ఎటిఎంల దగ్గర భద్రత కల్పించాలి
శిరివెళ్ల (పల్లెవెలుగు) 2 సెప్టెంబర్: మండల పరిధిలోని ఏటీఎం, బ్యాంకుల దగ్గర భద్రత కల్పించాలని సిరివెళ్ల ఎస్సై శరత్ కుమార్ రెడ్డి తెలిపారు. మండల కేంద్రమైన పోలీస్ స్టేషన్ అవరణంలో బ్యాంకుల అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏటీఎం, బ్యాంకుల వద్ద పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం వాచ్ మెన్ లు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇలా చేసుకోవడం వల్ల దొంగతనం జరగకుండా కాపాడు కోవచ్చునని అందువల్ల ప్రతి ఒక్కరు సహకరించాలని ఎస్సై శరత్ కుమార్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.