
అర్ధాంతరంగా నిలిచిపోయిన సచివాలయ భవన నిర్మాణ పనులు
శిరివేళ్ల (పల్లెవెలుగు) 29 ఆగష్టు: శిరివేళ్ల గ్రామాల్లోని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామాలలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం గ్రామ సచివాలయలు అద్దె భవనాల్లో, పంచాయతీ కార్యాలయంలో నిర్వహించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ పథకం కింద ఒక్కొక్క భవన నిర్మాణానికి 40 లక్షల నిధులు విడుదల అయ్యాయి గ్రామాలలో నెలలు గడుస్తున్నా ఇంతవరకు భవన నిర్మాణా పనులు చేయక పోవడంతో కొన్ని అర్ధాంతరంగా నిలిచిపోయాయి. కొన్ని గ్రామాలలో పంచాయతీ కార్యాలయంలో గ్రామ సచివాలయం కొనసాగించడంతో అనేక అవస్థలు పడుతున్నామని ప్రజలు పేర్కొన్నారు. మండలంలో కొన్ని నత్తనడక నడుస్తున్నాయని మరికొన్ని చోట్ల పనులు పూర్తి చేసిన ప్రారంభోత్సవానికి నోచుకోలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం రైతు భరోసా కేంద్రాలను అద్దె భవనాల్లో కొనసాగిస్తున్నారు. రైతు భరోసా పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి ప్రజలు విమర్శిస్తున్నారు. పనులు పూర్తి చేయకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రా భవన నిర్మాణం పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.