Allagaddanaga ashok

 గ్రామాన్ని అపరిశుభ్రత రహిత గ్రామంగా తీర్చిదిద్దడమే నా ధ్యేయం

మోత్కల పల్లెగ్రామ సర్పంచ్ భూమా వేణుగోపాల్ రెడ్డి

శిరివెళ్ల  (పల్లెవెలుగు) 27 ఆగష్టు: మండల పరిధిలోని మోత్కలపల్లి గ్రామంలో వ్యాధులు ప్రబలకుండా పటిష్టమైన, ప్రణాళిక చర్యలు చేపడుతున్నట్లు మోత్కల పల్లె  గ్రామ సర్పంచ్ భూమా వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలో  ప్రతి వీధుల వెంట కాలువలు, మురుగునీరు, నిలిచిన చోట, శుభ్రపరిచి శానిటేషన్ లో భాగంగా బ్లీచింగ్ పౌడర్ సున్నం చెల్లించామన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజలు పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. దోమలు వ్యాప్తి చెందడం వల్ల మలేరియా, డెంగ్యూ ,వైరల్ ఫీవర్ తదితర వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడమే అయినది. అంతేకాకుండా తాగునీటి  ట్యాంకుల్లో క్లోరినేషన్ చేయించా మన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks